
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరగా దేవర చిత్రంలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయమే సాధించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అంశం సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఉత్సాహంలో ముంచెత్తేలా హీరోయిన్ రుక్మిణి వసంత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆమె ఎన్టీఆర్ గురించి పరోక్షంగా హింట్ ఇస్తూ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఆమె భాగమవుతుందన్న ఊహాగానాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా రుక్మిణి వసంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలలో తెలుపు రంగు టైగర్ ప్రింట్ షర్ట్ ధరించి కనిపించింది. తన ఫోటోలకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ వైరల్ గా మారింది. టైగర్ టైగర్ బర్నింగ్ బ్రైట్ అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు, నెటిజన్లు ఇది ఎన్టీఆర్ 31 (NTRNeel) సినిమాకు సంబంధించిన హింట్ అని భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని ఆమె పరోక్షంగా టైగర్ అని పిలుస్తోంది అని.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్ర షూటింగ్ లో ఆమె జాయిన్ అవుతోంది కాబట్టి ఇలా పోస్ట్ చేసింది అని అంటున్నారు.
ఫ్యాన్స్ రియాక్షన్లు కూడా ఆసక్తికరంగా మారాయి. ఒకరు "NTRNEEL" మూవీ గురించి అని కామెంట్ చేయగా, మరొకరు "ఎన్టీఆర్ నీల్ చిత్రంలోకి స్వాగతం" అంటూపోస్ట్ చేశారు. ఈమె ఎన్టీఆర్ నీల్ మూవీ హీరోయిన్ అంటూ మరొకరు కామెంట్ చేశారు. అయితే, ఇప్పటివరకు ఈ వార్తలపై రుక్మిణి వసంత్ గానీ, చిత్ర యూనిట్ గానీ అధికారికంగా స్పందించలేదు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన ఈ బాలీవుడ్ మల్టీ స్టారర్ సినిమా ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతోంది. అంతేకాక, ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా NTRNeel 2026 జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక పౌరాణిక చిత్రం కూడా ప్లానింగ్ స్టేజ్‌లో ఉన్నట్టు వార్తలు ఉన్నాయి.
కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ చివరిసారిగా విజయ్ సేతుపతితో కలిసి ‘Ace’ చిత్రంలో నటించారు. ప్రస్తుతం శివకార్తికేయన్‌తో కలిసి నటించిన ‘మధరాసి’ విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 5న విడుదలకానున్న ఈ చిత్రంలో విద్యుత్ జమ్వాల్, బిజు మీనన్, షబీర్ కల్లరక్కల్, విక్రాంత్, ప్రేమ్ కుమార్, సంజయ్, సచన నామిదాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ హైప్ నెలకొన్న నేపథ్యంలో, రుక్మిణి వాసంత్ కీలక పాత్ర పోషించనున్నారన్న ప్రచారం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. రుక్మిణి వసంత్ క్రమంగా సౌత్ లో సెన్సేషనల్ హీరోయిన్ గా మారుతోంది.