
ఎపిసోడ్ ప్రారంభంలో మమ్మీ ఎక్కడ అని అడుగుతాడు రాహుల్. బయటికి రావాలంటే సిగ్గుగా అనిపిస్తుందంట లోపలే ఉండిపోయింది అంటుంది రేఖ. ఒక పెళ్లికూతురు లేచిపోయింది ఇంకో పెళ్లికూతురు మోసం చేసి తాళి కట్టించుకుంది వీళ్ళకి లేని సిగ్గు మమ్మీ కి ఎందుకు. ఇంతకీ ఇంత బుద్ధి చెప్పటానికి నేను ఉన్నాను. మమ్మీని బయటికి రమ్మని చెప్పు అంటాడు రాహుల్.
తల్లి కోసం వెళ్తున్న రేఖకి స్వప్న కనిపిస్తుంది. తనని గుర్తుపట్టేసిందేమో అని కంగారుపడుతుంది స్వప్న. కానీ కూల్ డ్రింక్స్ అందరికీ సరిగా ఇవ్వు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది రేఖ. నా కాబోయే ఆడపడుచు నాకంటే తింగరిది అనుకుంటుంది స్వప్న. మరోవైపు కూతురి రిసెప్షన్ చూస్తూ మురిసిపోతుంది కనకం. నా కూతురు నా ఇంట్లో ఉన్నంతకాలం దానికి నేను ఏమీ చేయలేకపోయాను.
దాని మనసుని మెచ్చిన దేవుడు దాన్ని ఇంత గొప్ప ఇంట్లో పడేసాడు. నా జీవితానికి ఇది చాలు అంటూ ఆనందపడుతుంది. మరోవైపు స్వప్నతో పెళ్లి తప్పిపోయి మంచిదైంది. ఆ అమ్మాయి అందమైనదే కానీ ఈ అమ్మాయితో ఉన్న అణకువ ఆ అమ్మాయిలో లేదు అంటుంది చిట్టి. మరోవైపు స్టేజ్ మీద ఉన్న కావ్య ని చూసి కుళ్ళుకుంటుంది స్వప్న. నేను లేచిపోవటం నీకు ఇలా కలిసి వచ్చిందా ఒక్క రోజులో మహారాణి వి అయిపోయావు.
ఎక్కడో ఉండవలసిన దానివి ఎక్కడ ఉన్నావు. నేను ఎక్కడ ఉండవలసిన దాన్ని ఇలా కూల్ డ్రింక్స్ మోసుకొని తిరుగుతున్నాను అంటూ కుళ్ళుకుంటుంది. నా పెద్ద కూతురు నెత్తిమీద శని కూర్చుని ఇలాంటి సంబంధాన్ని కాలదన్నుకుంది అంటుంది కనకం. మరోవైపు రాహుల్ కనుసైగ చేయడంతో రిపోర్టర్ వెళ్లి మీదంతా నటనేనా ఆ అమ్మాయిని మీరు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశారా అని అడుగుతుంది.
మీ అందరికీ క్లారిటీ ఇవ్వవలసిన బాధ్యత నాకు ఉంది. నాకు పెళ్లిలో ఎన్నో జరిగాయి. నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను కానీ పెళ్లి చేసుకోవడం కుదరలేదు అనుకోని పరిస్థితుల్లో ఈ అమ్మాయిని చేసుకున్నాను. మా దుగ్గిరాల కుటుంబం సంస్కారానికి నిలువెత్తు రూపం. డబ్బున్నవాళ్లు పేద వాళ్ళని చులకనగా చూస్తారు అనుకోవటం అపోహ అంటూ క్లారిటీ ఇస్తాడు రాజ్.
ఫోటోగ్రాఫర్స్ మీ స్టిల్ కావాలి అని అడుగుతారు. సీరియస్ గా ఉన్న రాజ్ ని నవ్వంటుంది కావ్య. నా నవ్వుని ముసుగు దొంగ ఎత్తుకుపోయింది అంటాడు రాజ్. నాకు దక్కాల్సిన సంతోషాన్ని నా చెల్లెలు తన్నుకు పోయింది ఈ రాహుల్ ఎక్కడ చచ్చాడో అనుకుంటూ రాహుల్ ని వెతుక్కుంటూ వెళ్తుంది స్వప్న. ఇంకా ఇక్కడే ఉంటే కావ్య కి మంచిది కాదు పదా వెళ్ళిపోదాం అంటూ బయటికి వెళ్లటానికి ప్రయత్నిస్తారు కనకం, మీనాక్షి.
అది గమనించిన మేనేజర్ ఇప్పుడు ఎక్కడికి నెక్స్ట్ ప్రోగ్రాం మీదే అంటూ మళ్ళీ లోపలికి పంపించేస్తాడు. నాకు మ్యాజిక్ చేయడం రాదు అంటూ తప్పదన్నట్లుగా లోపలికి వెళ్తారు అక్క చెల్లెలు ఇద్దరూ. మరోవైపు తనని పిలవడానికి వచ్చిన కూతురితో అక్కడ జరుగుతున్నది రిసెప్షనా, ఇంటి గుట్టు బయటపడకుండా పెళ్లికూతురి మోహన ఒక చీర పడేసి, నగలు దిగేసి అక్కడ ప్రదర్శనకు నిలబెట్టారు.
అలాంటి షో చూడటానికి నేను రావాలా అంటుంది రుద్రాణి. ఈ పెళ్లి మీ వల్లే జరిగింది అంటుంది రేఖ. నా వల్లే జరిగింది మీ కుటుంబం అంటే కసి నాకు. ఎక్కడో నా బ్రతుకు నేను బ్రతుకుతుంటే ఈ ముసలాయన మా నాన్న మీద ప్రేమతో తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టారు నేను ఇష్టపడిన వ్యక్తిని కాకుండా సాంప్రదాయం మంచివాడు అంటూ నాకు ఇష్టం లేని పెళ్లి చేసింది. నాకు పెళ్ళికొడుకుని ఎంచుకుని స్వేచ్ఛను కూడా ఇవ్వలేదు.
అందుకే మాటకి మాట సమాధానం చెప్పే ఆ కాకిని ఈ ఇంటి కోడలు చేశాను అంటుంది రుద్రాణి. ఆ ఇష్టం లేని భార్యని పక్కన పెట్టుకొని రాజ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు అప్పుడే రాహుల్ ని రాహుల్ లోకి దింపి అధికారాలు పెంచుకునేలాగా చేస్తాను. రాజు కన్నా రాహులే సముద్రుడని అందరూ అనుకునేలా చేస్తాను ఇది నా గోల్. ఈ పనికిరాని రిసెప్షన్ నాకెందుకు అంటుంది రుద్రాణి.
మరోవైపు స్టేజి మీదకి తీసుకురాగానే నీకు నోరు పెరిగింది అంటాడు రాజ్ నేను మీ పరువు నిలబెట్టడం కోసమే మనసులో బాధ ఉన్న పైకి నవ్వుతూ నిలబడుతున్నాను కొంచెం మర్యాదగా మాట్లాడండి అంటుంది కావ్య. గారు అని గౌరవించాలా, నా వల్ల కాదు అంటాడు రాజ్. నౌ లెట్స్ ఎంజాయ్ ద పార్టీ అంటూ స్టేజ్ దిగి వెళ్ళిపోతారు రాజ్ దంపతులు.
మరోవైపు నెక్స్ట్ ప్రోగ్రాం మీదే నేను పిలిచినప్పుడు రండి అంటూ ఆ మేనేజర్ అక్కడినుంచి వెళ్ళిపోతాడు. నేను జీవితంలో నటించగలను గాని స్టేజ్ మీద నటించలేను అంటూ కంగారుపడుతుంది కనకం. అంతలోనే పిల్లలందరూ ఆమె చుట్టూ మూగుతారు. జోకర్ ని చూసిన కావ్య తను అమ్మ లాగా ఉంది అనుకుంటుంది. అది గమనించిన కళ్యాణ్ కావ్య దగ్గరికి వెళ్లి మీరు అనుమాన పడుతున్నది నిజమే తను మీ అమ్మగారే అని చెప్తాడు.మా అమ్మ ఇక్కడికి ఎలా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది కావ్య.
మిమ్మల్ని చూడాలని ఫోన్ చేశారు అందుకే నేనే ఈ ఏర్పాట్లు చేశాను అంటాడు కళ్యాణ్. ఇక్కడ ఎవరైనా గుర్తు పడితే ఎంత ప్రమాదం అంటుంది కావ్య. కంగారు పడకండి కన్న కూతురైన మీరే నేను చెప్తేనే గాని గుర్తుపట్టలేదు అంటాడు కళ్యాణ్. తరువాయి భాగంలో స్టేజ్ మీద మ్యాజిక్ చేస్తున్న తల్లిని చూసి ఎమోషన్ ఆపుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెని హగ్ చేసుకుంటుంది కావ్య. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.