`ఆర్‌ఆర్‌ఆర్‌ 2`పై క్రేజీ అప్‌ డేట్‌ ఇచ్చిన రైటర్‌ విజయేంద్రప్రసాద్‌.. ఇక రచ్చ రచ్చే..

Published : Mar 13, 2023, 07:36 PM IST
`ఆర్‌ఆర్‌ఆర్‌ 2`పై క్రేజీ అప్‌ డేట్‌ ఇచ్చిన రైటర్‌ విజయేంద్రప్రసాద్‌.. ఇక రచ్చ రచ్చే..

సారాంశం

`ఆర్‌ఆర్‌ఆర్‌` సంచలనం సృష్టించింది. `నాటు నాటు` పాటకిగానూ ఆస్కార్‌ అందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు `ఆర్‌ఆర్‌ఆర్‌` సీక్వెల్‌పై స్పందించారు విజయేంద్రప్రసాద్‌. క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు.

`ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఆస్కార్‌ రావడం పట్ల రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇండియన్స్ గర్వపడినట్టుగానే తాను గర్వపడుతున్నానని తెలిపారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`తో ఆస్కార్‌ సాకారం చేసిన రాజమౌళికి ఫాదర్‌ అయినందుకు, ఆయన తనకు కుమారుడు అయినందుకు ఓ తండ్రిగా గర్వపడుతున్నానని, అత్యంత సంతోషకరమైన సందర్భం అని అన్నారు. ఆస్కార్‌ ప్రకటించే సమయంలో అందరిలాగే తాను ఎగ్జైట్‌ అయినట్టు చెప్పారు. 

తాజాగా `ఆర్‌ఆర్‌ఆర్‌`లోని `నాటు నాటు` పాటకి ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ దక్కిన విషయం తెలిసిందే. దీంతో ఇండియన్‌ సినిమా చరిత్ర సృష్టించింది. తెలుగు సినిమా ప్రపంచానికి తెలిసేలా చేసింది `నాటు నాటు`. ఈ సినిమాకి పునాది వేశారు విజయేంద్రప్రసాద్‌. ఆయన మదిలో పుట్టిన కథే `ఆర్‌ఆర్ఆర్‌` అనే విషయం తెలిసిందే. ఆస్కార్‌ వచ్చినప్పుడు తాను ఎంతో హ్యాపీగా ఫీలైనట్టు చెప్పారు. తాజాగా ఆయనతో `ఏషియానెట్‌ తెలుగు` ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్బంగా అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆస్కార్‌ తనపై బాధ్యత పెంచిందన్నారు. మున్ముందు మరిన్ని మంచి కథలు రాసేందుకు ప్రోత్సాన్నిచ్చిందన్నారు. రచయితని గౌరవిస్తే ఇలాంటి ఫలితాలే ఉంటాయన్నారు. 

ఇందులో `ఆర్‌ఆర్‌ఆర్‌` సీక్వెల్‌పై స్పందించారు విజయేంద్రప్రసాద్. `ఆర్‌ఆర్‌ఆర్‌` అభిమానులకు క్రేజీ అప్‌ డేట్‌ ఇచ్చారు. ఇంతకు మించి `ఆర్‌ఆర్‌ఆర్‌2` ఉండబోతుందన్నారు. ఇదే కథకి కొనసాగింపుగా కథ ఉంటుంది, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటిస్తారని వెల్లడించారు. ఇదే కాంబినేషన్‌లో సినిమా చేయబోతున్నామని, ఆ వివరాలు మున్ముందు వెల్లడిస్తామని తెలిపారు. ఇంతకు మించి దీనిపై ఇప్పుడు తాను స్పందించలేనన్నారు. 

ఈ సందర్భంగా మహేష్‌బాబుతో రాజమౌళి చేయబోయే సినిమా గురించి చెప్పారు. భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్‌లో అంతర్జాతీయంగా ఈ సినిమా ఉంటుందన్నారు. అయితే అంతర్జాతీయంగా అంటే అదేదో కాదని, మనవైన ఎమోషన్స్, మనవైన కథలే ఉంటాయన్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` లో అంతర్జాతీయ అంశాలేవి లేవని, కథ బాగుండాలని, కథ బాగుంటే చూస్తారని, ఆ కథ, ఆ ఎమోషన్‌ నచ్చిందని, హృదయాన్ని హత్తుకుందని, అందుకే ఇంతగా ఆదరించారని, దానికి భాషతో సంబంధం లేదన్నారు. ప్రస్తుతం మహేష్‌బాబు సినిమా వర్క్ జరుగుతుందన్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు