RRR బ్యూటీ బర్త్ డే.. ఇంగ్లీష్ పిల్ల గురించి కనీసం క్లూ కూడా ఇవ్వని జక్కన్న

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 29, 2022, 09:22 PM ISTUpdated : Jan 29, 2022, 09:24 PM IST
RRR బ్యూటీ బర్త్ డే.. ఇంగ్లీష్ పిల్ల గురించి కనీసం క్లూ కూడా ఇవ్వని జక్కన్న

సారాంశం

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. దేశం మొత్తం ఎదురుచూస్తున్న చిత్రం ఇది.

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. దేశం మొత్తం ఎదురుచూస్తున్న చిత్రం ఇది. దర్శక ధీరుడు రాజమౌళి నుంచి బాహుబలి తర్వాత వస్తున్న చిత్రం కావడం, ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ అభిమానులని విశేషంగా ఆకట్టుకోవడంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. 

ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో చివరి నిమిషంలో వాయిదా వేయాల్సి వచ్చింది. ఆరంభం నుంచి ఆర్ఆర్ఆర్ చిత్రానికి కరోనా అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. జనవరి 7న ఆర్ఆర్ఆర్ చిత్రానికి రిలీజ్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ , అలియా భట్, ఇతర చిత్ర సభ్యులు దేశం మొత్తం తిరిగి ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. 

కానీ ఊహించని విధంగా కరోనా మరోసారి ఆర్ఆర్ఆర్ చిత్రానికి అడ్డుగా నిలిచింది.  రాబోవు రోజుల్లో కరోనా పరిస్థితులని బట్టి మార్చి 18న కానీ, ఏప్రిల్ 28న కానీ విడుదల చేస్తాం అని చిత్ర యూనిట్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో రాంచరణ్ కి జోడిగా అలియా భట్, ఎన్టీఆర్ కి జోడిగా ఇంగ్లీష్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. నేడు ఒలీవియా మోరిస్ తన 25వ జన్మదిన వేడుక జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. 

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని అందమైన స్టిల్ ద్వారా ఒలీవియా మోరిస్ కి బర్త్ డే విషెష్ తెలిపారు. ఒలీవియా మోరిస్ విషయంలో ఆర్ఆర్ఆర్ టీం వైఖరిపై ఎన్టీఆర్ అభిమానులు కాస్త గుర్రుగానే ఉన్నారు. ఎందుకంటే రాంచరణ్ సరసన నటిస్తున్న అలియా బట్ సీత పాత్రపై ఇప్పటికే రాజమౌళి కొంత డీటైలింగ్ ఇచ్చారు. కానీ ఒలీవియా మోరిస్ రోల్ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లేదు. ఆమె ఈ చిత్రంలో బ్రిటిష్ యువతిగా నటిస్తోంది అనేది మాత్రమే తెలుసు. ట్రైలర్ లో కూడా ఒలీవియా రోల్ పై అంతగా ఫోకస్ లేదు. 

బ్రిటిష్ కోటలోకి ప్రవేశించిన తర్వాత రాంచరణ్, ఎన్టీఆర్ లకు ఒలీవియా సాయం చేస్తుంది అనే ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే ఆర్ఆర్ఆర్ రిలీజ్ వరకు ఆగాల్సిందే. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Finale: కళ్యాణ్ పడాల తలకు గాయం? సింపతీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేశారా? నిజమెంత?
అయోమయంలో నందమూరి హీరోల సీక్వెల్ చిత్రాలు.. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురి పరిస్థితి అంతే