Lakshmi Pranathi :ట్విట్టర్ లోకి ఎన్టీఆర్ భార్య ప్రణతి. ఇంతలోనే షాకింగ్ ట్విస్ట్

Surya Prakash   | Asianet News
Published : Jan 29, 2022, 05:55 PM IST
Lakshmi Pranathi :ట్విట్టర్ లోకి  ఎన్టీఆర్ భార్య ప్రణతి. ఇంతలోనే షాకింగ్ ట్విస్ట్

సారాంశం

ఇప్పటివరకు సోషల్ మీడియాకు, లైమ్‌లైట్‌కు దూరంగా ఉన్న ప్రణతి ఒక్కసారిగా ట్విటర్‌లో అడుగుపెట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. లక్ష్మి ప్రణతి ట్విటర్‌లో అడుగుపెట్టిన గంటల్లోనే వేల సంఖ్యలో ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. 


 మరో స్టార్ హీరో ఎన్టీఆర్ భార్య సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి చాలా తక్కువగా మీడియా ముందుకు వస్తారు. ఇప్పటివరకు ఆమె సోషల్ మీడియాలోకి  రాలేదు. తాజాగా మూడు రోజుల క్రితం రిపబ్లిక్ డే రోజు ఆమె ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చింది అంటూ మీడియాలో వార్తలు గుప్పు మన్నాయి.

అంతేకాదు మొదటి పోస్ట్ గా తన భర్త ఎన్‌టీఆర్‌ కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోతో పాటు ‘మీ అందరితో కలిసి ట్విటర్‌లో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నా మొదటి ట్వీట్ నా లవ్లీ భర్తతో పోస్ట్ చేస్తున్నాను’ అంటూ ప్రణతి తన భర్త ఎన్‌టీఆర్‌ను ట్యాగ్ చేసింది. ఇప్పటివరకు సోషల్ మీడియాకు, లైమ్‌లైట్‌కు దూరంగా ఉన్న ప్రణతి ఒక్కసారిగా ట్విటర్‌లో అడుగుపెట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. లక్ష్మి ప్రణతి ట్విటర్‌లో అడుగుపెట్టిన గంటల్లోనే వేల సంఖ్యలో ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇక్కడే ట్విస్ట్ పడింది. అసలు ఆ ఎక్కౌంట్ ఫేక్  అని తేలింది.  ఆమె కేవలం ఇనిస్ట్రాలో మాత్రమే ఉన్నారు.

అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం ఈ విషయం పట్టించుకోకుండా , చెక్ చేయకుండా న్యూస్ లు పబ్లిష్ చేసేసాయి. దాంతో చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు ఆమెను ఫాలో అవటం మొదలెట్టారు. అసలు ఎన్టీఆర్ భార్య కనుక ట్విట్టర్ లో ప్రవేశిస్తే...మొదట ఎన్టీఆర్ ఆమెను ఫాలో అవుతారు అనే ఆలోచన కూడా చెయ్యలేదు.

ఇక టాలీవుడ్‌కి చెందిన పలువురు స్టార్‌ హీరోల సతీమణులు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. ముఖ్యంగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు భార్య నమ్రత, రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన, అల్లు అర్జున్‌ భార్య స్నేహ.. తమ భర్తలకు సంబంధించిన సినిమా కబుర్లతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు తమ అభిమానులతో పంచుకుంటూ నెట్టింట సందడి చేస్తుంటారు.

 

PREV
click me!

Recommended Stories

Anshula Kapoor Mehendi: పెళ్లి కూతురైన అన్షులా.. మెహందీ వేడుకలో పెద్ది హీరోయిన్ ని చూశారా, వైరల్ ఫోటోస్
Peddi OTT Release: 'పెద్ది' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?