కరోనాని ఎదుర్కొనేందుకు `కలిసినిలబడదాం`.. `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్ ఐదు భాషల్లో సందేశం

Published : May 06, 2021, 02:36 PM ISTUpdated : May 06, 2021, 02:37 PM IST
కరోనాని ఎదుర్కొనేందుకు `కలిసినిలబడదాం`.. `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్ ఐదు భాషల్లో సందేశం

సారాంశం

`ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌ సైతం ఆపదలో ఉన్న వారికి అవసరమైన సాయం అందించే ప్రయత్నం చేస్తుంది. ఇక మరోసారి ప్రజలకు తమ సందేశాన్ని అందించింది `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌. ఐదు భాషల్లో ఐదుగురు తారలు కరోనా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. 

కరోనా విలయతాండవం చేస్తుంది. చిత్ర పరిశ్రమలన్నీ ఆగిపోయాయి. వైరస్‌ రోజు రోజుకి మరింతగా విస్తరిస్తుంది. వేలమంది మృత్యువాత పడుతున్నారు. రోజుకి దాదాపు నాలుగు లక్షల కేసులు భారత్‌లో నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. పేరెంట్లకి సరైన ట్రీట్‌మెంట్‌ అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌ సైతం ఆపదలో ఉన్న వారికి అవసరమైన సాయం అందించే ప్రయత్నం చేస్తుంది. ఇక మరోసారి ప్రజలకు తమ సందేశాన్ని అందించింది `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌. ఐదు భాషల్లో ఐదుగురు తారలు కరోనా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. 

ఎన్టీఆర్‌,రామ్‌చరణ్‌, అలియా భట్‌, అజయ్‌ దేవగన్‌, రాజమౌళి ఒక్కొక్కరు ఒక్కో భాషలో తమ సందేశాన్ని అందించారు. లెట్స్ `స్టాండ్‌ టుగెదర్‌` అంటూ కరోనాని ఎదుర్కొనేందుకు కలిసి నిలబడదామని పిలుపునిచ్చారు. అలియాభట్‌ తెలుగులో చెప్పగా, రామ్‌చరణ్‌ తమిళంలో, ఎన్టీఆర్ కన్నడలో, రాజమౌళి మలయాళంలో, అజయ్‌ దేవగన్‌ హిందీలో కరోనా నియమాలు, జాగ్రత్తలు చెబుతూ, ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. ప్రస్తుత క్లిష సమయాన్ని వివరిస్తూ జాగ్రత్తలు తెలిపారు. మాస్క్ కచ్చితంగా ధరించాలని, వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలని తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోని పంచుకున్నారు. 

ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేస్తూ, `ప్రతి ఒక్కరు కచ్చితంగా మాస్క్ ధరించండి. వ్యాక్సినేషన్‌ చేయించుకోండి. కరోనాని స్టాప్‌ చేసేందుకు కలిసి నిలబడదాం. కరోనా విస్తరించకుండా ఆపేద్దాం. దేశాన్ని కాపాడదాం` అని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌తోపాటు రామ్‌చరణ్‌, రాజమౌళి కూడా ట్వీట్ల ద్వారా ఈ వీడియోని పంచుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా, అలియా భట్‌ హీరోయిన్‌, అజయ్‌ దేవగన్‌ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాని అక్టోబర్‌ 13న విడుదల చేయాలని భావిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ