తారక్ లేకుండా 1000మందితో చరణ్ యుద్ధం

By Prashanth MFirst Published Feb 8, 2019, 4:57 PM IST
Highlights

టాలీవుడ్ బడా మల్టీస్టారర్ RRR మొదటి షెడ్యూల్ అనంతరం కాస్త ఎక్కువగా గ్యాప్ తీసుకున్న రాజమౌళి ఇక సెకండ్ షెడ్యూల్ మొదలెట్టినప్పటి నుంచి రెస్ట్ తీసుకోవడం లేదు. రీసెంట్ తారక్ సంబందించిన కొన్ని హెవీ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేశారు. 

టాలీవుడ్ బడా మల్టీస్టారర్ RRR మొదటి షెడ్యూల్ అనంతరం కాస్త ఎక్కువగా గ్యాప్ తీసుకున్న రాజమౌళి ఇక సెకండ్ షెడ్యూల్ మొదలెట్టినప్పటి నుంచి రెస్ట్ తీసుకోవడం లేదు. రీసెంట్ తారక్ సంబందించిన కొన్ని హెవీ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేశారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఒక సెట్ లో షూటింగ్ జరిగింది. 

అయితే తారక్ ముందు నుంచే ఎక్కువగా కష్టపడుతున్నాడు. పైగా వర్కౌట్స్ చేసి ఈ మధ్య కొత్త లుక్ లోకి మారాడు. దీంతో జూనియర్ రెస్ట్ తీసుకోవాలని హాలిడేస్  ఇచ్చి చరణ్ తో ఒక పెద్ద యాక్షన్ ఎపిసోడ్ ని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్ట్ లకు గత కొన్ని రోజులుగా చిత్ర యూనిట్ ప్రత్యేక శిక్షణతో రెడీ చేస్తోంది. వారితో చరణ్ పోరాడడానికి సిద్దమయ్యాడు. 

కొన్ని రోజుల రెస్ట్ అనంతరం తారక్ మళ్ళీ షూటింగ్ లోకి రానున్నాడు. అంతవరకు లుక్ ఏ మాత్రం మారకుండా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. ఎమ్ఎమ్ కీరవాణి మార్చ్ నుంచి తన మ్యూజిక్ పనులను మొదలెట్టనున్నారు. సినిమా మ్యూజిక్ కోసం కొత్త రకమైన టెక్నీక్స్ ఏవో వాడనున్నట్టు తెలుస్తోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న RRR సినిమా 300కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.  

click me!