హారికపై అభిజిత్‌ మళ్లీ ఫైర్‌.. పులిహోర అమ్ముకున్న అవినాష్‌.. చితక్కొట్టిన అరియానా

Published : Dec 03, 2020, 11:16 PM IST
హారికపై అభిజిత్‌ మళ్లీ ఫైర్‌.. పులిహోర అమ్ముకున్న అవినాష్‌.. చితక్కొట్టిన అరియానా

సారాంశం

రాత్రి అనే తేడా లేకుండా లైట్లు అలానే ఉంచాలని బిగ్‌బాస్‌ చెప్పడంతో టాస్క్ లో ఉన్న సోహైల్‌, అఖిల్‌లతోపాటు అభిజిత్‌, హారిక, మోనాల్‌, అవినాష్‌, అరియానా కూడా జాగారం చేయాల్సి వచ్చింది. నిద్ర బాగా వస్తుందని బిగ్‌బాస్ కి అవినాష్‌ తన ఆవేదన వ్యక్తం చేశాడు. 

ఓ వైపు సోహైల్‌, అఖిల్‌ మధ్య గ్రాండ్‌ ఫినాలెకి సంబంధించిన టాస్క్ జరుగుతుంది. మరోవైపు రాత్రి సమయంలో లైట్లు ఆపకూడదని బిగ్‌బాస్‌ కండీషన్‌ పెట్టాడు. దీంతో సభ్యులంతా నిద్ర పోకుండా ఉండాల్సి వచ్చింది. అయితే హారిక వెంటనే స్పందించి బిగ్‌బాస్‌పై పంచ్‌ వేసింది. మొన్న దెయ్యం టాస్క్ లో అవినాష్‌ రాత్రి మొత్తం నవ్వుతూ ఉండాలన్నప్పుడు ఇలా చేయలేదు ఎందుకు బిగ్‌బాస్‌ అని ప్రశ్నించింది. అంతకు ముందు అరియానా సైతం బిగ్‌బాస్‌ పై సెటైర్లు వేసింది. బిగ్‌బాస్‌ అంటే ఇష్టమని, నిజాయితీగా ఉంటాడని పరోక్షంగా విమర్శించింది. 

రాత్రి అనే తేడా లేకుండా లైట్లు అలానే ఉంచాలని బిగ్‌బాస్‌ చెప్పడంతో టాస్క్ లో ఉన్న సోహైల్‌, అఖిల్‌లతోపాటు అభిజిత్‌, హారిక, మోనాల్‌, అవినాష్‌, అరియానా కూడా జాగారం చేయాల్సి వచ్చింది. నిద్ర బాగా వస్తుందని బిగ్‌బాస్ కి అవినాష్‌ తన ఆవేదన వ్యక్తం చేశాడు. నిద్ర నుంచి ఆపుకునేందుకు కామెడీకి తెరలేపారు అవినాష్‌. ఈ సందర్భంగా అరియానా, అవినాష్‌, హారికల మధ్య సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అవినాష్‌ని పులిహోరా బ్యాచ్‌గా కామెంట్ చేశారు. అవినాష్‌ కూడా పులిహోరే.. పులిహోరే అంటూ వాగడం, దానికి హారిక సైతం కామెంట్‌ చేయడం, అలాగే అరియానా కామెంట్‌ చేస్తుండగా, నేను వచ్చి దవడ మీద కొడతానని అన్నాడు. 

కోపంతో వచ్చిన అరియానా.. అరియానాని చితకబాదింది. కడుపులో గుద్దింది. టాస్క్ చేస్తున్న సోహైల్‌, అఖిల్‌ ఉయ్యాల చుట్టూ ఉరికించి మరీ కొట్టింది. ఈ ఎపిస్‌డో ఆద్యంతం నవ్వులు పూయించింది. అలా రాత్రి మొత్తం ఈ టాస్క్ జరిగింది. 

మరోవైపు టాస్క్ సమయంలో అభిజిత్‌, హారికల మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. వీరి మధ్య గత టాస్క్ లకు సంబంధించి చర్చ జరుగుతుండగా, అభిజిత్‌ ఇంగ్లీష్‌లో మాట్లాడారు. దీనికి హారికి స్పందిస్తూ ఇంగ్లీష్‌లో మాట్లాడవద్దని చెప్పింది. అందుకు అభిజిత్‌ సీరియస్‌ అయ్యాడు. ఏదైనా ఉంటే బిగ్‌బాస్‌ చెబుతాడు.. నువ్వు చెప్పొద్దని సీరియస్‌ అయ్యాడు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు