'RRR'షాక్.. హీరోయిన్ ఔట్!

Published : Apr 06, 2019, 09:26 AM IST
'RRR'షాక్.. హీరోయిన్ ఔట్!

సారాంశం

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'RRR' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'RRR' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇటీవల జిమ్ లో రామ్ చరణ్ కి గాయం కావడంతో మూడు వారాల పాటు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. తాజాగా చిత్రబృందం నుండి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ ని ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ సరసన ఈ భామ కనిపిస్తుందని ప్రెస్ మీట్ లో రాజమౌళి వెల్లడించారు. కానీ ఇప్పుడు ఈమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

''కొన్ని అనివార్య కారణాల వలన డైసీ ఎడ్గర్ జోన్స్ ఈ సినిమాలో నటించడం లేదు. ఆమెకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం'' అంటూ RRR టీం ట్వీట్ చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం మరో హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారు.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌