మహేష్ బాబు 'మహర్షి' టీజర్!

Published : Apr 06, 2019, 09:17 AM IST
మహేష్ బాబు 'మహర్షి' టీజర్!

సారాంశం

మహేష్ బాబు హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి రూపొందించిన 'మహర్షి' సినిమా టీజర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

మహేష్ బాబు హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి రూపొందించిన 'మహర్షి' సినిమా టీజర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉగాది సందర్భంగా చిత్రయూనిట్ మహేష్ అభిమానులకు ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి. టీజర్ చూసిన మహేష్ అభిమానులు పండగా చేసుకుంటున్నారు. ఇందులో మహేష్ స్టైలిష్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. 

''సక్సెస్ లో ఫుల్ స్టాప్స్ ఉండవ్.. కామాస్ మాత్రమే ఉంటాయ్.. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్.. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ''

''నాకొక ప్రాబ్లెం ఉంది సర్.. ఎవరైనా ఓడిపోతావ్ అంటే గెలిచి చూపించడం నాకు అలవాటు'' అంటూ మహేష్ చెప్పిన డైలాగులు హైలెట్ గా నిలిచాయి. 

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ సెట్ రూపొందించి అందులో సినిమా పాటని చిత్రీకరిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతీ మూవీస్‌, పీవీపీ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే నెల 9న చిత్రాన్ని ప్రేక్షకుల  ముందుకు తీసుకురానున్నారు. 

PREV
click me!

Recommended Stories

Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..