చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన `బిగ్‌బాస్‌ 5` ఫేమ్‌ లోబో..

By Aithagoni RajuFirst Published Dec 9, 2021, 7:27 PM IST
Highlights

ఊహించని విధంగా హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యారు లోబో. ఇదిలా ఉంటే లోబో బంపర్‌ ఆఫర్‌ కొట్టేశాడు. మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి నటించే ఛాన్స్‌ కొట్టేశాడు.

టీవీ షోస్‌తో అలరించిన లోబో(Lobo).. ఇటీవల `బిగ్‌బాస్‌ తెలుగు5`(Bigg Boss Telugu 5) షోలో ఛాన్స్ కొట్టేసి మరింత పాపులర్‌ అయ్యారు. ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఐదో సీజన్‌ బిగ్‌బాస్‌ షోలో తనదైన స్టయిల్‌లో కామెడీని పంచుతూ నవ్వులు పూయించారు. తనదైన మ్యానరిజంతో మెప్పించారు. అయితే ప్రారంభంలో నవ్వులు పంచారు. ఆ తర్వాత క్రమంగా ఆయనలో ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్‌ తగ్గిపోయింది. దీంతో ఊహించని విధంగా హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. సీక్రెట్‌ రూమ్‌లో ఉన్నా, ఆ తర్వాత ఆయనలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఎనిమిదో వారంలో లోబో ఎవిక్ట్ అయ్యారు. 

ఇదిలా ఉంటే లోబో బంపర్‌ ఆఫర్‌ కొట్టేశాడు. మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi)తో కలిసి నటించే ఛాన్స్‌ కొట్టేశాడు. చిరంజీవి చిత్రంలో లోబోకి ఛాన్స్ దక్కినట్టు ఇటీవల ఆయన పేర్కొన్నారు. Chiranjeevi పిలిచి మరీ తన సినిమాలో ఆఫర్‌ ఇచ్చారని లోబో వెల్లడించారు. ఈ సందర్భంగా చిరంజీవితో దిగిన ఫోటోని పంచుకున్నారు. `నా కల నిజమైంది. చిరంజీవి సార్ సినిమాలో ఆఫర్‌ వచ్చింది` అని వెల్లడించారు. ఇటీవల ఓ షోలో లోబో పాల్గొని ఇదే విషయాన్ని తెలిపారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lobo (@lobo__619)

చిరంజీవి సినిమా ఆఫర్‌పై స్పందిస్తూ ఎమోషనల్‌ అయ్యారు. `సినిమాలో నాది చిరు సార్‌ని అంటిపెట్టుకుని ఉండే పాత్ర, మెగాస్టార్‌ పక్కన నటించడం అంటే తన కల సాకారమైనట్టే` అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఏ సినిమాలో లోబో నటిస్తున్నది క్లారిటీ ఇవ్వకపోయినా, ఆ తర్వాత ఆయన దర్శకుడు మెహర్‌ రమేష్‌తో కలిసి దిగిన ఫోటోని పంచుకోవడం విశేషం. దీంతో మెహర్‌ రమేష్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న `భోళాశంకర్‌` చిత్రంలో లోబోకి అవకాశం దక్కినట్టు తెలుస్తుంది. 

`భోళాశంకర్‌` తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన `వేదాళం` చిత్రానికి రీమేక్‌ అనే విషయం తెలిసిందే. అజిత్‌-శివ కుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్‌ చేయడం విశేషం. ఇక ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తిసురేష్‌.. చిరుకి చెల్లిగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. 

also read: 100 శాతం నిజం అనుకుంటున్నా.. RRR ట్రైలర్ పై చిరంజీవి, సమంత, పూజ హెగ్డే రియాక్షన్

click me!