
యావత్ దేశం ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. మార్చి 25న ఈ చిత్రం రిలీజ్ కి ముస్తాబవుతున్న తరుణంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నేడు కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ కనీవినీ ఎరుగని విధంగా నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కర్ణాటక పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లోకి ఇప్పుడే యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ రాంచరణ్.. రాజమౌళితో కలసి ఎంట్రీ ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్న ప్రాంగణం మొత్తం జనసంద్రంలా తలపిస్తోంది. ఆరంభంలో అభిమానులని కంట్రోల్ చేయడం పోలీసులకు కూడా కష్టంగా మారిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్ గా ఆర్ఆర్ఆర్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్, రాంచరణ్ దేశం మొత్తం చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఈ చిత్రంలో కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.