RRR :ఇంతొస్తే కానీ తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌’రికవరీ కాదు

Surya Prakash   | Asianet News
Published : Mar 23, 2022, 08:22 AM IST
RRR :ఇంతొస్తే కానీ తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌’రికవరీ కాదు

సారాంశం

ఆర్ ఆర్ ఆర్ సినిమాకు (Rated U/A) U/A సర్టిఫికెట్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా టోటల్ రన్ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చింది. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్,రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటించారు.

ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌’ కోసం తెలుగు ప్రేక్షకులే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌‌ అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వారి ఎదురుచూపులు ముగిసే సమయం దగ్గర పడింది.  25 అర్దరాత్రి నుంచే బెనిఫిట్ షోలతో ఈ  సినిమా రిలీజ్ కాబోతోంది. ఈలోపు వీలైనంత ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు రాజమౌళి.తన ప్రచారాలతో,టూర్స్ తో  సూపర్‌‌‌‌ హైప్ క్రియేట్ చేశారు. ఈ నేపధ్యంలో ఈ  చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.  ఎంత వస్తే రికవరీ అవుతుందనే లెక్కలు ట్రేడ్ లో మొదలయ్యాయి.

అందుతున్న సమచారం ప్రకారం... ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో ఈ   చిత్రం రైట్స్ ని భారీ మొత్తాలకు సొంతం చేసుకున్నారు.  నైజాం (తెలంగాణా) రైట్స్ ని 72 కోట్లకు తీసుకున్నారు. అలాగే ఆంధ్రా డీల్ అయితే 90 కోట్లు అని తెలుస్తోంది. సీడెడ్ (రాయలసీమ) అయితే 35 కోట్లు. ఈ ఎగ్రిమెంట్స్ అన్నీ కోవిడ్ టైమ్స్ కన్నా ముందే జరిగినవి. అయితే తర్వాత జరిగిన రకరకాల పరిణామాలతో ..నిర్మాత డివివి దానయ్య... పదిహేను శాతం రిబేట్ ఇచ్చినట్లు సమాచారం. అది లెక్కల్లోకి తీసుకున్నా 180 కోట్లు వస్తేనే కానీ లాభాల్లోకి రాదు.అయితే తెలంగాణాలో విపరీతంగా పెరిగిన టిక్కెట్ రేట్లు,సినిమాకు ఉన్న హైప్ ని పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం రికవరీ అవటం  పెద్ద విషయం ఏమీ కాదు.

 ఆలియాభట్‌‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్‌‌గా నటించిన ఈ చిత్రంలో.. అజయ్ దేవగన్, శ్రియ  కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌‌తో నిర్మించారు.  . ఆర్ ఆర్ ఆర్ సినిమాకు (Rated U/A) U/A సర్టిఫికెట్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా టోటల్ రన్ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చింది. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్,రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే యూఎస్‌లో ఎన్టీఆర్ ఓ అభిమాని ఏకంగా థియేటర్ నే బుక్ చేయడం విశేషం.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనే ముందు రోజే స్పెషల్ షోస్ వేయనున్నారు. ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్సే టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా