ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్స్ (RRR Trailer)థియేటర్స్ దద్దరిల్లేలా చేస్తుంది. వెండితెరపై ఆవిష్కృతమైన ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ జనాలను కుర్చీలలో నిలవకుండా చేస్తుంది. కేవలం ట్రైలర్ కే పిచ్చెక్కిపోతుండగా... విశేషాలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.
184 సెకండ్ల నిడివి కలిగిన ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ తో అబ్బురపరిచాయి. రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ పై తెరకెక్కిన యాక్షన్ సన్నివేశాలు విజువల్ ట్రీట్ లా ఉన్నాయి.ఇండియాలోనే కనీవినీ ఎరుగని యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ ఉంది. ముఖ్యంగా పులితో ఎన్టీఆర్ ఫైట్ ట్రైలర్ లో హైలెట్ అని చెప్పొచ్చు. పులితో ఎన్టీఆర్ ముఖాముఖీ తలపడగా.. దాన్ని బంధించిన తీరుకు థియేటర్స్ దద్దరిల్లేలా చేసింది. అడవుల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్(NTR) కలిసి చేసిన పోరాటాలు... మరో లెవెల్ అని చెప్పాలి.
ఇద్దరు హీరోలు విభిన్న గెటప్స్ లో మెస్మరైజ్ చేశారు. మూడు నిమిషాల ట్రైలర్ ఎక్కడా నెమ్మదించలేదు. పాత్రల నుండి ఎమోషన్స్ కూడా ట్రైలర్ లో ఒడిసిపట్టి చూపించాడు. సినిమాలోని ప్రధాన పాత్రలు అన్నింటినీ పరిచయం చేశారు. మొత్తంగా ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ నభూతో నభవిష్యతి అన్నట్లు రాజమౌళి రూపొందించారు.స్టోరీ టెల్లింగ్ లో ఆయన మాస్టర్ అని నిరూపించుకున్నారు.
ఇక నేడు ముంబైలో 12 గంటలకు ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ విడుదల కార్యక్రమం జరగనుంది. సల్మాన్ ఈ ఈవెంట్ లో పాల్గొననున్నట్లు ప్రచారం జరుగుతుంది. నేడు సాయంత్రం ఆర్ ఆర్ ఆర్ టీమ్ హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ లో పాల్గొననున్నారు. డిసెంబర్ 10న బెంగుళూరు, చెన్నై నగరాల్లో ఆర్ ఆర్ ఆర్ టీమ్ సందడి చేయనుంది.
Also read కుంభస్థలాన్ని కొట్టడమే.. హోరెత్తిపోయిన RRR ట్రైలర్, బాక్సాఫీస్ కి చుక్కలే
పలు నగరాల్లో ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే రాజమౌళి (Rajamouli)తెలిపారు. డివివి దానయ్య రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ నిర్మించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. జనవరి 7న వరల్డ్ వైడ్ గా రికార్డు థియేటర్స్ లో విడుదల కానుంది.
Also read RRR Trailer Promo: మాటు వేసి వేటాడుతున్న ఎన్టీఆర్...