RRR: ఇకపై ఎన్టీఆర్ బిజీ.. ఆలోచన విరమించుకున్న రాజమౌళి!

Published : Jul 29, 2019, 06:47 PM IST
RRR: ఇకపై ఎన్టీఆర్ బిజీ.. ఆలోచన విరమించుకున్న రాజమౌళి!

సారాంశం

దర్శకధీరుడు రాజమౌళి తెరక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ అంత సాఫీగా ఏం జరగడం లేదు. రాంచరణ్, ఎన్టీఆర్ పోటీ పడుతూ గాయాలకు గురవుతున్నారు. దీనితో దాదాపు నెలరోజుల పాటు షూటింగ్ వాయిదా పడింది. కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.   

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ అంత సాఫీగా ఏం జరగడం లేదు. రాంచరణ్, ఎన్టీఆర్ పోటీ పడుతూ గాయాలకు గురవుతున్నారు. దీనితో దాదాపు నెలరోజుల పాటు షూటింగ్ వాయిదా పడింది. కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 

హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి కావడంతో నార్త్ లో భారీ షెడ్యూల్ కు ప్లాన్ చేశారు. ముందుగా పుణేలో కీలకమైన సన్నివేశాలు తెరక్కించాలనుకున్నారు. కానీ తాజాగా రాజమౌళి ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. పూణే షెడ్యూల్ ని చెన్నైకి మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

సడెన్ గా లొకేషన్ ఎందుకు చేంజ్ చేశారనే విషయంలో క్లారిటీ లేదు. చెన్నై షెడ్యూల్ లో ఎన్టీఆర్ నటించే సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయట. దీనితో ఈ షెడ్యూల్ మొత్తం ఎన్టీఆర్ బిజీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

ఎన్టీఆర్ కు హీరోయిన్ సమస్య కూడా వెంటాడుతోంది. ఎన్టీఆర్ కు జోడిగా అనుకున్న డైసీ ఎడ్గార్ జోన్స్ చివరినిమిషంలో తప్పుకుంది. దీనితో రాజమౌళి ఎన్టీఆర్ కోసం కొత్త ఇంగ్లీష్ పిల్లని సెట్ చేసే పనిలో ఉన్నాడు. 

PREV
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం