Book My Show: బుక్ మైషోలో ఆల్ ఇండియా రికార్డ్ బ్రేక్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’.. హై రేటెడ్ ఫిల్మ్ గా దూసుకెళ్తోంది..

Published : Apr 03, 2022, 03:50 PM ISTUpdated : Apr 03, 2022, 04:04 PM IST
Book My Show: బుక్ మైషోలో ఆల్ ఇండియా రికార్డ్ బ్రేక్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’.. హై రేటెడ్ ఫిల్మ్ గా దూసుకెళ్తోంది..

సారాంశం

మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ ‘రౌద్రం రణం రుధిరం’ RRR. ఈ చిత్రం అన్నీ రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న  ఈ చిత్రం.. తాజాగా మారో రికార్డును  క్రియేట్ చేసింది.  

దర్శకుడు రాజమౌళి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆర్ ఆర్ ఆర్  చిత్రాన్ని తెరకెక్కించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)లు హీరోగా తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ లో ఒకరు కొమరం భీమ్, మరొకరు అల్లూరి సీతారామరాజు పాత్రలు చేశారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt), ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు. అజయ్ దేవ్ గణ్ (Ajay Devgan) కీలక రోల్ చేశారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.

భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం.. ప్రస్తుతం అదే దిశగా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతోంది. ఊహించని విధంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. మొదటి వారం ముగిసే నాటికి ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ గా రూ. 710 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఇండియా వరకు చూస్తే రూ. 560 కోట్ల గ్రాస్ దాటేసింది. మరో రెండు వారాలు బాక్సాఫీస్ వద్ద ఆర్ ఆర్ ఆర్ కు పోటీనే లేదు. అలాగే హిందీలోనూ రూ.150 కోట్ల వసూళ్లు రాబట్టి తెలుగు సినిమా సత్తాను చాటుతూ కొత్త రికార్డును క్రియేట్ చేసింది ఆర్ఆర్ఆర్. 

అయితే, తాజాగా ఈ చిత్రం బుక్ మై షోలో (Book My Show) ఆల్ ఇండియా రికార్డులన్నింటనీ బ్రేక్ చేసింది ఆఱ్ఆర్ఆర్. ఇప్పటి వరకు 571 కే కి పైగా ఆర్ఆర్ఆర్ మూవీకి రేటింగ్ ఇవ్వడం విశేషం. ఇప్పటి వరకు ఏ సినిమాకైనా ఇదే అత్యధిక రేటింగ్ అని చెప్పాలి. 90 శాతం మంచి రేటింగ్ ను సాధించిన ఈ పాన్ ఇండియా చిత్రం  టాప్ లో దూసుకుపోతోంది. ఇలా జక్కన్న డైరెక్షన్ ఆర్ఆర్ఆర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

 

PREV
click me!

Recommended Stories

హీరోకి రూ.110 కోట్లు, హీరోయిన్ కి రూ.2 కోట్లు.. ఏమాత్రం సంబంధం లేని రెమ్యునరేషన్స్ వైరల్
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ రొమాంటిక్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. డీటెయిల్స్ ఇవిగో