ఇతర భాషల్లో RRR కి షాక్.. అలెర్ట్ కాకుంటే కష్టమే

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 21, 2022, 01:40 PM IST
ఇతర భాషల్లో RRR కి షాక్.. అలెర్ట్ కాకుంటే కష్టమే

సారాంశం

తెలుగు మినహా నార్త్, ఇతర భాషల్లో ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన మేర లేవు. దీనితో ఆర్ఆర్ఆర్ టీం త్వరగా అలెర్ట్ కావాలని అభిమానులు సూచిస్తున్నారు.   

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అన్ని పాజిబుల్ వేస్ లో రాజమౌళి ఈ చిత్రానికి ప్రచారం కల్పిస్తున్నారు. ప్రస్తుతం చరణ్, తారక్, జక్కన్న ప్రమోషన్స్ కోసం ఇండియా మొత్తం చుట్టేస్తున్నారు. 

సినిమాపై నెలకొన్న హైప్, ప్రమోషన్స్ జోరు చూస్తుంటే ఆర్ఆర్ఆర్ చిత్రం ఓపెనింగ్స్ విషయంలో రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. యుఎస్ లో, తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీనితో ట్రెండ్ పండితులు భారీ ఓపెనింగ్ ఫిగర్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 

మరో మూడు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో దేశంలో అన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. అయితే తెలుగులో ఉన్నంత జోరు ఇతర భాషల్లో కనిపించడం లేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. నార్త్ లో ఆర్ఆర్ఆర్ బుకింగ్స్ నత్తనడకగా సాగుతున్నారు. 

ప్రస్తుతం నార్త్ లో కాశ్మీర్ ఫైల్స్ మూవీ మూడ్ కొనసాగుతోంది. మరికొందరు ప్రేక్షకులు ఇంకా ఓటిటి మూడ్ లోనే ఉన్నారని అంటున్నారు. బాహుబలి సినిమా విడుదలైనప్పుడు పరిస్థితులు వేరు. బాహుబలి మొదటి భాగం నార్త్ లో మౌత్ టాక్ తో పుంజుకుంది. ఇక బాహుబలి 2 చిత్రం హిందీ బెల్ట్ లో కూడా రికార్డులు తిరగరాసింది. ఇక్కడ కట్టప్ప ఫ్యాక్టర్ ని మరిచిపోలేం. 

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలై మూడు నెలలు గడచిపోతోంది. సో ఆర్ఆర్ఆర్ టీం అర్జెంట్ గా అలెర్ట్ కావాలని ట్రేడ్ విశ్లేషకులు సూచిస్తున్నారు. కనీసం ఒక నిమిషం నిడివి ఉన్న చిన్న ట్రైలర్ విడుదల చేయాలని సూచిస్తున్నారు. కొత్త ట్రైలర్ రిలీజ్ చేయకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తో గుడ్డిగా ప్రమోషన్స్ చేసుకుంటూ పోతే ప్రయోజనం ఉండకపోవచ్చు. 

కొత్త ట్రైలర్ విడుదల చేసినప్పటికీ నార్త్ లో ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా పరిస్థితి ఏమైందో గుర్తించాలి. ప్రభాస్ మూవీకి అంత దారుణమైన కలెక్షన్స్ అసలు ఊహించలేదు. 

 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్