Pabhas: మోడ్రెన్ మహాభారతం... కల్కి గా ప్రభాస్?

Published : Mar 21, 2022, 01:12 PM IST
Pabhas: మోడ్రెన్ మహాభారతం... కల్కి గా ప్రభాస్?

సారాంశం

ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ప్రాజెక్ట్ కె. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ మూవీ కథపై ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ లో ఆసక్తి నెలకొని ఉంది.కాగా ప్రాజెక్ట్ కె కథపై ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.


మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ మూవీ 'ప్రాజెక్ట్ కె'(Project K). ఈ చిత్రాన్ని ఏకంగా పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రాజెక్ట్ కె చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్ కె సైన్స్ ఫిక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ మూవీలో వాడే కార్లకు సంబంధించి సాంకేతిక సహాయం అందించాలని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రను నాగ్ అశ్విన్ కోరారు. దానికి ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారు. దీంతో ప్రాజెక్ట్ కె అడ్వాన్స్డ్ సైన్స్ ఫిక్షన్ మూవీ అని క్లారిటీ వచ్చింది. 

అయితే ఈ సినిమాకు స్ఫూర్తి మాత్రం మహాభారతంలోని కొన్ని కీలక పాత్రలు అంటున్నారు. దీని ఆధారంగా ప్రాజెక్ట్ కె లో... కె అంటే అర్థం కల్కి అని అంటున్నారు. ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం ‘ప్రాజెక్ట్ కె’ సినిమా కథాంశం మహాభారతంలోని రెండు ప్రధాన పాత్రల బేస్ గా రూపొందుతోందట. అందులో ఒకటి విష్ణు మూర్తి కల్కి అవతారమైతే.. రెండోది అశ్వథ్ధామ పాత్ర అని టాక్.  కల్కి పాత్ర ను ప్రభాస్ (Prabhas)చేస్తుండగా.. అశ్వథ్థామ పాత్రను అమితాబ్ చేస్తున్నారని టాక్. మహాభారతంలో ద్రోణుడి కొడుకైన అశ్వథ్థామ చిరంజీవి. ఆయనకి మరణం లేదు.  అసలు ‘ప్రాజెక్ట్ కె’ అంటే ‘ప్రాజెక్ట్ కల్కి’ అని అర్ధమని ప్రచారం జరుగుతుంది.  

విష్ణుమూర్తి పదవ అవతారం కల్కి. కలియుగాంతంలో విష్ణువు కల్కిగా అవతరించబోతున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. వీర ఖడ్గం ధరించి, తెల్లటి గుర్రంపై విహరిస్తూ దుష్ట సంహారం గావించే ఆ అవతారం బేస్ గా ‘ప్రాజెక్ట్ కె’ ను నాగ్ అశ్విన్  ఆసక్తికరంగా మలుస్తున్నట్టు సమాచారం.మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. విశేషంగా ప్రచారం అవుతుంది. ఈ వార్తలు మూవీపై అంచనాలు మరో స్థాయికి తీసుకెళుతున్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతోన్న  ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె నటిస్తోంది. 

ఇక ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ (Radhe Shyam)ఆశించినంత విజయం సాధించలేదు. కేవలం 50 శాతం బిజినెస్ చేసిన రాధే శ్యామ్ భారీ నష్టాలు మిగల్చనుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు నిరాశపరిచాయి. దీనితో అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సలార్ మూవీపై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. 2023 సంక్రాంతి కానుకగా ఆదిపురుష్ విడుదల కానుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి