ఆర్ ఆర్ ఆర్ మేకింగ్ వీడియోకే ఇంత హైపా..!

By team teluguFirst Published Jul 14, 2021, 8:15 PM IST
Highlights

రేపు ఉదయం 11గంటలకు ఆర్ ఆర్ ఆర్ మేకింగ్ వీడియో విడుదల చేస్తున్నట్లు రాజమౌళి టీమ్ ప్రకటించారు. అలాగే ఎన్టీఆర్, రాజమౌళి, చరణ్ లతో కూడిన ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. రోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్ పేరుతో విడుదల కానున్న ఈ మేకింగ్ వీడియో కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు అర్థం అవుతుంది.

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ దాదాపు కంప్లీట్. సినిమా విడుదల తేదీపై క్లారిటీ లేనప్పటికీ ప్రమోషన్స్ మాత్రం షురూ చేశాడు రాజమౌళి. ఇప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ నుండి, ఎన్టీఆర్, చరణ్ ఫస్ట్ లుక్ వీడియోలతో పాటు స్పెషల్ పోస్టర్స్ రావడం జరిగింది. ప్రతి అప్డేట్ ఎక్కడా నిరుత్సాహ పరచకుండా, అంచనాలకు మించి ఉన్నాయి. దీనితో ఆర్ ఆర్ ఆర్ మూవీపై ప్రేక్షకులలో అంచనాలు మరో స్థాయికి చేరాయి. 


కాగా రేపు ఉదయం 11గంటలకు ఆర్ ఆర్ ఆర్ మేకింగ్ వీడియో విడుదల చేస్తున్నట్లు రాజమౌళి టీమ్ ప్రకటించారు. అలాగే ఎన్టీఆర్, రాజమౌళి, చరణ్ లతో కూడిన ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. రోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్ పేరుతో విడుదల కానున్న ఈ మేకింగ్ వీడియో కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు అర్థం అవుతుంది. కారణం... ప్రకటించిన మరు నిమిషం నుండి సోషల్ మీడియాలో ఆర్ ఆర్ ఆర్ మూవీకి సంబంధించిన ట్యాగ్స్ భారీగా ట్రెండ్ అవుతున్నాయి. 


అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు చరణ్ ఫ్యాన్స్ ఆర్ ఆర్ ఆర్ మూవీ ట్యాగ్స్ భారీగా ట్రెండ్ చేస్తున్నారు. కేవలం మేకింగ్ వీడియోకే ఇంత హడావుడి, హైప్ క్రియేటైన నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ ఈ స్థాయిలో ట్రెండ్ కానుందో ఊహించడానికి కష్టంగా ఉంది. 


ఇక చరిత్రలో పోరాటయోధులు గా నిలిచిన కొమరం భీం, అల్లూరి సీతారామరాజు జీవిత గాథలు కాల్పనికత జోడించి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్నాడు. అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేస్తుండగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సంగీతం కీరవాణి అందిస్తున్నారు. 

R U READY ..........
A glimpse into the making of RRR
Tomorrow July 15th, at 11 AM..... 💥💥💥 pic.twitter.com/tKcultRVGh

— KK Senthil Kumar ISC (@DOPSenthilKumar)
click me!