రామ్-లింగు స్వామి మూవీ సెట్స్ లో డైరెక్టర్ శంకర్

Published : Jul 14, 2021, 06:12 PM ISTUpdated : Jul 14, 2021, 06:18 PM IST
రామ్-లింగు స్వామి మూవీ సెట్స్ లో డైరెక్టర్ శంకర్

సారాంశం

హైదరాబాద్ వచ్చిన డైరెక్టర్ శంకర్, రామ్ మూవీ షూటింగ్ సెట్స్ కి వెళ్లారు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా ఆయన అక్కడు వెళ్లడం జరిగింది.   

స్టార్ డైరెక్టర్ శంకర్ హీరో రామ్ మూవీ సెట్స్ లో ప్రత్యక్షం అయ్యారు. రామ్, దర్శకుడు లింగు స్వామితో ఆయన ముచ్చటించడం జరిగింది. రామ్ తన 19వ చిత్రం పందెంకోడి ఫేమ్ లింగు స్వామితో ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన డైరెక్టర్ శంకర్, రామ్ మూవీ షూటింగ్ సెట్స్ కి వెళ్లారు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా ఆయన అక్కడు వెళ్లడం జరిగింది. 


షూటింగ్ మానిటర్ చేసిన శంకర్, రామ్ తో పాటు దర్శక నిర్మాతలతో ముచ్చటించారు. శంకర్ లాంటి పెద్ద దర్శకుడు తమ మూవీ సెట్స్ కి రావడంతో యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు.నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ "సోమవారం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. హీరో రామ్, హీరోయిన్ కృతీ శెట్టి, నదియా తదితరులపై లింగుసామి సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సడన్ గా సడన్‌గా సెట్స్‌కు వచ్చిన శంకర్‌ గారిని చూసి టీమ్ అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. ఆయనకు రామ్, కృతి, నదియా, లింగుసామి స్వాగతం పలికారు. ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన లవ్ సాంగ్ ట్యూన్ వినిపించారు. మెలోడీయస్ గా ఉందని, చాలా బావుందని ఆయన ప్రశంసించడం మాకెంతో సంతోషాన్నిచ్చింది" అని అన్నారు.


యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. నదియా కీలక రోల్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం
విజేతని డిసైడ్ చేసే ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్, ఇమ్ము కథ ముగిసినట్లేనా.. కళ్యాణ్, తనూజ లలో ఎవరు ముందంజ ?