`ఆర్‌ఆర్‌ఆర్‌`కి మరో ప్రతిష్టాత్మక పురస్కారం.. కీరవాణికి అవార్డుల పంట

Published : Jan 16, 2023, 07:44 AM ISTUpdated : Jan 16, 2023, 08:17 AM IST
`ఆర్‌ఆర్‌ఆర్‌`కి మరో ప్రతిష్టాత్మక పురస్కారం.. కీరవాణికి అవార్డుల పంట

సారాంశం

ఇటీవల `గోల్డెన్‌ గ్లోబ్‌` అవార్డుతో ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్‌ సినిమా సత్తాని చాటింది `ఆర్‌ఆర్‌ఆర్‌`. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక అవార్డుని సొంతం చేసుకుంది. 

`ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం ఇండియన్‌ సినిమా సత్తాని, తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటుకుంటోంది. ఇది గ్లోబల్‌ వైడ్‌గా అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటికే దీనికి `గోల్డెన్‌ గ్లోబ్‌` అవార్డు దక్కింది. `నాటు నాటు` పాటకిగానూ కీరవాణి ఈ  అత్యున్నత పురస్కారం అందుకున్నారు. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక అవార్డు `ఆర్‌ఆర్‌ఆర్‌` కి వరించింది.  ఫారెన్‌ లాంగ్వేజెస్‌ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డు దక్కింది. దీంతోపాటు `నాటు నాటు`కి మరో పురస్కారం వరించింది.

అమెరికాలోని `లాస్‌ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్‌` అవార్డు దక్కడం విశేషం. `నాటు నాటు` పాటకిగానూ బెస్ట్ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కీరవాణిని ఎంపిక చేశారు. ఈ అవార్డు అందుకున్న సందర్భంగా దిగిన ఫోటోని కీరవాణి ట్విట్టర్‌ ద్వారా పంచుకుంటూ తన సంతోషాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా అభిమానులు, నెటిజన్లు స్పందిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదే ఊపులో ఆస్కార్‌ సాధించాలని కోరుకుంటున్నారు. 

ప్రస్తుతం ఈ సినిమా `ఆస్కార్‌` బరిలో ఉంది. `ఉత్తమ నటుడు`, ఉత్తమ దర్శకుడు, ఒరిజినల్‌ సాంగ్‌ విభాగాల్లో ఇది ఆస్కార్‌ కోసం పోటీ పడుతుంది. ఈ నెలాఖరులో నామినేషన్స్ ఫైనల్‌ అవుతున్నాయి. ఆస్కార్‌కి నామినేట్‌ అయ్యిందంటే ఆల్మోస్ట్ ఆస్కార్‌ వచ్చినట్టే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా, డీవీవీ దానయ్య నిర్మించారు. అలియాభట్‌, అజయ్‌ దేవగన్‌, శ్రియా, ఒలివియా మోర్రీస్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా గతేడాది మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఏకంగా రూ.1200కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఇతర దేశాల్లోనూ మంచి కలెక్షన్లతో రన్‌ అవుతుండటం విశేషం.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది
Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది