ఒకే చోట 175 ఎకరాలు కొనుగోలు చేసిన సుమన్.. భార్య కోరిక మేరకు అలా చేద్దాం అనుకుంటే కథ అడ్డం తిరిగింది

By tirumala AN  |  First Published Sep 30, 2024, 12:41 PM IST

నటుడు సుమన్ రీల్ లైఫ్, రియల్ లైఫ్ గురించి అన్ని దాదాపుగా అన్ని విషయాలు అందరికీ తెలుసు. బిగినింగ్ లో సుమన్ కెరీర్ ఉవెత్తున ఎగసింది. ఆ తర్వాత సుమన్ ఎలాంటి వివాదంలో చిక్కుకున్నాడు ? జైలు జీవితం ఎందుకు అనుభవించాడు విషయాలపై అపోహలు ఉండేవి.


నటుడు సుమన్ రీల్ లైఫ్, రియల్ లైఫ్ గురించి అన్ని దాదాపుగా అన్ని విషయాలు అందరికీ తెలుసు. బిగినింగ్ లో సుమన్ కెరీర్ ఉవెత్తున ఎగసింది. ఆ తర్వాత సుమన్ ఎలాంటి వివాదంలో చిక్కుకున్నాడు ? జైలు జీవితం ఎందుకు అనుభవించాడు విషయాలపై అపోహలు ఉండేవి. సుమన్ వివాదంలో చిక్కుకున్న మాట వాస్తవమే. జైలుకి వెళ్లిన సంగతి కూడా నిజమే. దానివల్లే సుమన్ తన కెరీర్ లో బాగా వెనుకబడిపోయాడు. 

భార్య కోరిక మేరకు 175 ఎకరాల ల్యాండ్ కొన్న సుమన్ 

అయితే ఆ వివాదం వెనుక వినిపించిన కారణాలు రూమర్స్ మాత్రమే. తనని కేసులో ఇరికించిన వారి గురించి చాలా మంది ప్రముఖులు వాస్తవాలు తెలిపారు. సుమన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. అయితే సుమన్ గురించి సంచలన విషయాలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉంటాయి. సుమన్ ఆస్తులకి సంబంధించిన వివాదం కూడా ఉంది. చాలా ఏళ్ళ క్రితం సుమన్ యాదగిరి గుట్ట సమీపంలో ఒక ప్రాపర్టీని కొన్నారట. ఏకంగా 175 ఎకరాల ల్యాండ్ అది. ఆ ల్యాండ్ ని ఏం చేద్దాం అని ఆలోచిస్తుండగా తన భార్య ఒక ఐడియా చెప్పింది. 

సైనికులకు విరాళం ప్రకటించిన సుమన్ 

Latest Videos

ఆ స్థలంలో ఆయుర్వేదిక్ రిసార్ట్ ని నిర్మిద్దాం అని చెప్పిందట. సుమన్ ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత మరో ఆలోచన వచ్చిందట. ఆ సమయంలో కార్గిల్ వార్ కూడా జరిగింది. కార్గిల్ వార్ లో పాల్గొన్న సైనికుల కోసం ఏదో ఒకటి చేయాలి అని నేను నా భార్య అనుకున్నాం. కార్గిల్ లో పోరాడిన సైనికుల కోసం 175 ఎకరాల్లో కొంత ల్యాండ్ విరాళంగా ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. ఆ ల్యాండ్ లో కొంత కొండలు గుట్టలు ఉన్నాయి. అది కాకుండా బావున్న స్థలాన్ని సైనికులకు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సుమన్ తెలిపారు. 

కానీ ఊహించని విధంగా ఆ ల్యాండ్ వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తోంది. వివాదాలు తొలగిపోయి మాకు అనుకూలంగా తీర్పు వస్తే సైనికుల కోసం మేము ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాం అని సుమన్ తెలిపారు. ఆ ల్యాండ్ కి డబుల్ రిజిస్ట్రేషన్ జరగడం వల్ల వివాదం నెలకొంది అని సుమన్ తెలిపారు. 

జైలు నుంచి తిరిగి వచ్చి కెరీర్ లో నిలదొక్కుకున్న సుమన్ 

కెరీర్ బిగినింగ్ లో హీరోగా అదరగొట్టిన సుమన్.. చిరంజీవికి సైతం పోటీ ఇచ్చారు. ఆ తర్వాత కేసుల వల్ల వెనుకబడ్డారు. జైలు నుంచి తిరిగి వచ్చి మునుపటిలా కాకున్నా బాగానే రాణించారు. తన కెరీర్ గురించి సుమన్ గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. నా దర్శకులు, నిర్మాతలు నన్ను రిపీట్ చేశారు. నా క్యారెక్టర్ బ్యాడ్ అయితే ఆ విధంగా దర్శకులు కానీ నిర్మాతలు కానీ మళ్ళీ నా దగ్గరకి వచ్చేవారు కాదు. చాలా మంది దర్శకులు నిర్మాతలతో నేను 5 లేదా 6 చిత్రాలు చేశాను. ఇక హీరోయిన్లతో కూడా నాకు ఎలాంటి విభేదాలు ఉండేవి కావు. నాతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్లు అంటే విజయశాంతి, భానుప్రియ అని చెప్పొచ్చు. 

హీరోయిన్లతో సుమన్ కి మంచి రిలేషన్ 

ప్రతి హీరోయిన్ నన్ను ఇష్టపడేవారు. సుమన్ తో మేము సినిమా చేయము అని చెప్పిన హీరోయిన్ ఒక్కరు కూడా లేరు. దానికి కారణం నా క్యారెక్టర్. సినిమాలో రొమాంటిక్ సీన్ ఉన్నప్పటికీ హీరోయిన్లని అడిగి చేసేవాడిని. వాళ్ళు మాకు ఇబ్బంది అంటే చేసే వాడిని కాదు. కొన్నిసార్లు హీరోయిన్లు ముద్దు సీన్ కి నో చెప్పేవారు. కానీ డైరెక్టర్ వచ్చి షాట్ జరుగుతున్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకుని పెట్టేయండి అని చెప్పేవారు.నో నేను అలా చేయను అని చెప్పవాడిని. ఆమె ఒప్పుకుంటే ఒకే. అలా అనుమతి లేకుండా చేయను అని చెప్పా. ఆ విధంగా తన క్యారెక్టర్ మైంటైన్ చేసినట్లు సుమన్ తెలిపారు. 

ఇక సుమన్ తన కెరీర్ లో విలన్ గా కూడా ప్రయోగం చేశారు. రజనీకాంత్ శివాజీ చిత్రంలో సుమన్ విలన్ గా నటించారు. ఆ పాత్ర సుమన్ కి కొత్త గుర్తింపు తీసుకువచ్చింది. సుమన్ సినిమా విషయాలు మాత్రమే కాకుండా రాజకీయ సామాజిక అంశాల గురించి కూడా మాట్లాడడం చూస్తూనే ఉన్నాం. 

click me!