పెళ్లిచూపులు హీరోయిన్ కు లక్కీ ఛాన్స్

Published : Feb 10, 2017, 06:30 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
పెళ్లిచూపులు హీరోయిన్ కు లక్కీ ఛాన్స్

సారాంశం

పెళ్లిచూపులు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రితూ వర్మ తాజాగా కోలీవుడ్ లో చీయాన్ విక్రమ్ సరసన ఆఫర్ కొట్టేసిన రితూ

పెళ్ళి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్ రితూ వర్మ.  ఇప్పుడో సూపర్‌ అవకాశాన్ని దక్కించుకుంది రితూ. ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో ఉత్తమ నటి అవార్డును కూడా అందుకుంది. అనుకోకుండా తరువాత రీతూవర్మ నటించిన పెళ్లిచూపులు చిత్రం చిన్న చిత్రంగా తెరకెక్కినా... సంచలన విజయాన్ని కైవసం చేసుకుంది. దీంతో రీతూకు ఫుల్ పబ్లిసిటీ లభించింది.

 

పెళ్లిచూపులు చిత్ర రీమేక్‌ హక్కులను ప్రముఖ కోలీవుడ్‌ దర్శకుడు గౌతమ్‌మీనన్‌ సొంతం చేసుకున్నారు. ఇందులోనూ నాయకిగా రీతూవర్మనే అనుకున్నారాయన. అయితే అనూహ్యంగా ఆ అవకాశాన్ని మిల్కీబ్యూటీ తమన్నా తన్నుకు పోయింది.

 

ఇప్పుడు రీతూకు గౌతమ్‌మీనన్‌ మరో సూపర్‌ ఆఫర్‌ను అందించారు. చియాన్‌ విక్రమ్‌ హీరోగా ఆయన దర్శకత్వం వహిస్తున్న యాక్షన్‌ థ్రిల్ల ర్‌ కథా చిత్రం ధ్రువనక్షత్రంలో హీరోయిన్‌ అవకాశం రీతూవర్మను వరించింది. నిజానికి ఇందులో నటి అను ఎమ్మాన్యుయేల్‌ ఎంపికయ్యారు. తను విక్రమ్‌తో కలిసి ఫొటో షూట్‌లో కూడా పాల్గొన్నారు. అలాంటిది ఇప్పుడు తను ధ్రువనక్షత్రం చిత్రం నుంచి వైదొలిగినట్లు, ఆ పాత్రలో నటి రీతూవర్మ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత ఎస్కేప్‌ ఆర్టిస్ట్‌ అధినేత పి.మదన్‌ స్పష్టం చేశారు. మొత్తం మీద నటి రీతూవర్మ కోలీవుడ్‌లో చాలా బలంగా కాలు పెడుతోందన్న మాట. ఈ అమ్మడు ఇప్పటికే ఓ తమిళ చిత్రంలో యువ నటుడు కళైయరసన్‌కు జంటగా నటిస్తోంది.

PREV
click me!

Recommended Stories

తేజ తర్వాత సుమన్ శెట్టి దేవుడిలా కొలిచే తెలుగు హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.! నాగచైతన్యతో సమంత, శోభిత.. అసలు మ్యాటర్ ఇది