సెన్సేషన్ హిట్ “కాంతారా” OTT రిలీజ్ డిటేల్స్

Published : Oct 12, 2022, 05:16 PM IST
 సెన్సేషన్ హిట్ “కాంతారా” OTT రిలీజ్ డిటేల్స్

సారాంశం

ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను.. విధ్వంసం సృష్టిస్తే.. అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అడవి తల్లి నైజం. ప్రేమ భావోద్వేగాలు, గ్రామీణ వాతావారాన్ని ఆహ్లదకరంగా చూపించిన ఈ చిత్రం తెలుగులోనూ భారీగా రిలీజ్ అవుతోంది.


‘కేజీఎఫ్‌’ మూవీ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ‘హోంబలేఫిల్మ్‌’ సంస్థ నిర్మించిన మరో పాన్‌ ఇండియా చిత్రం ‘కాంతారా’. రిషబ్‌శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించారు. విజయ్‌ కిరగందూర్‌ నిర్మాత. ఇటీవలె కన్నడలో విడుదలై ఘన విజయం అందుకున్న ఈ చిత్రం తెలుగు హక్కులను నిర్మాత అల్లు అరవింద్‌ సొంతం చేసుకున్నారు. ఈ నెల 15న విడుదల చే స్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటిలో ఎప్పుడు వస్తోంది..ఏ ఓటిటి వారు హక్కులు తీసుకున్నారనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఓటిటి హక్కులను అమేజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. అయితే ఓటిటి రిలీజ్ డేట్ పై మాత్రం ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా సూపర్ హిట్ అయిన నేపధ్యంలో యాభై రోజులు తర్వాత మాత్రమే ఓటిటిలో కనిపించే అవకాసం ఉంది. అప్పుడే అన్ని భాషల్లో ఒకేసారి ఓటిటి రిలీజ్ చేస్తారని అంటున్నారు. తెలుగులో కూడా కన్నడ మాదిరి పెద్ద హిట్ అయితేనే ఈ రూల్ వర్తిస్తుంది. లేకపోతే ముందే వస్తుందని,తెలుగు వెర్షన్ మటుకు నెల రోజుల్లో వచ్చేస్తుందని అంటున్నారు. అంతా తెలుగు భాక్సాఫీస్ దగ్గర వచ్చే రిజల్ట్ బట్టి ఉంటుందని కన్నడ మీడియా అంటోంది. 
 
ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకుని “గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా “కాంతారా” సినిమాను రిలీజ్ చేయనున్నారు.”కాంతారా” అంటే సంస్కృత భాషలో అడవి.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.... అటవీ నేపథ్యంలో వచ్చిన ‘పుష్ప’ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అడవి నేపథ్యంలో తెరకెక్కిన ‘కాంతారా’ సినిమా కూడా ఆ స్థాయిలో అలరిస్తుంది.  వైవిధ్యమైన సినిమాలు చూడాలనుకునేవారికి ‘కాంతారా’ తప్పకుండా నచ్చుతుంది. 40 నిమిషాల పాటు సాగే పతాక సన్నివేశాలు కట్టిపడేశాయి. రిషబ్‌శెట్టి దర్శకత్వం, నటన అద్భుతంగా ఉన్నాయి’ అన్నారు. రిషబ్‌శెట్టి మాట్లాడుతూ ‘అడవులు, సాగుభూములు నేపథ్యంలో సాగే మిస్టరీ కథ ఇది. కన్నడలో మంచి స్పందన దక్కింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాం, ఆదరించండి’ అని కోరారు. 

ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను.. విధ్వంసం సృష్టిస్తే.. అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అడవి తల్లి నైజం. ప్రేమ భావోద్వేగాలు, గ్రామీణ వాతావారాన్ని ఆహ్లదకరంగా చూపించిన ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ను అధికారికంగా రిలీజ్ చేశారు . అక్టోబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇది కూడా డెఫినెట్ గా మంచి వసూళ్లు సెట్ చేస్తుందని అని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. 

ఈ ఏడాది రిలీజైన కేజీఎఫ్-2, చార్లీ 777 తర్వాత కన్నడలో విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది ‘కాంతార’. గత నెలలో కన్నడ భాషలో ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు బుక్ మై షోలో 99 శాతం రేటింగ్ ఉండటం విశేషం. 50 వేల మంది ఓటు వేసినా ఈ స్థాయిలో పర్సంటేజ్ ఉండటం అంటే గొప్ప విషయమే అని ట్రేడ్ అంటోంది.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?