`రిచిగాడి పెళ్లి` స్పెషల్‌ ప్రీమియర్ రివ్యూ..

By Aithagoni Raju  |  First Published Mar 1, 2023, 6:55 PM IST

సినిమాపై నమ్మకంతో రెండు మూడు రోజుల ముందుగానే సినిమాలను చూపించడం ఇటీవల ట్రెండ్‌గా మారింది. `రైటర్‌ పద్మభూషణ్‌` సినిమా ఈ విషయంలో సక్సెస్‌ అయ్యింది. దీంతో చిన్న సినిమాలకు ఇదొక కొత్త దారిగా మారిపోయింది. అందుకే వరుసగా చిన్న చిత్రాలను ముందుగానే ప్రదర్శిస్తున్నారు. దిల్‌రాజు నిర్మించిన `బలగం` చిత్రాన్ని కూడా అలానే ప్రదర్శించారు. ఇప్పుడు మరో చిన్న సినిమా `రిచిగాడి పెళ్లి` మార్చి 3న రిలీజ్‌ కానుండగా రెండు రోజుల ముందే మీడియాకి ప్రదర్శించారు యూనిట్‌. మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 


సినిమాపై నమ్మకంతో రెండు మూడు రోజుల ముందుగానే సినిమాలను చూపించడం ఇటీవల ట్రెండ్‌గా మారింది. `రైటర్‌ పద్మభూషణ్‌` సినిమా ఈ విషయంలో సక్సెస్‌ అయ్యింది. దీంతో చిన్న సినిమాలకు ఇదొక కొత్త దారిగా మారిపోయింది. అందుకే వరుసగా చిన్న చిత్రాలను ముందుగానే ప్రదర్శిస్తున్నారు. దిల్‌రాజు నిర్మించిన `బలగం` చిత్రాన్ని కూడా అలానే ప్రదర్శించారు. ఇప్పుడు మరో చిన్న సినిమా `రిచిగాడి పెళ్లి` మార్చి 3న రిలీజ్‌ కానుండగా రెండు రోజుల ముందే మీడియాకి ప్రదర్శించారు యూనిట్‌. మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. ఇక ఈ చిత్రంలో నవీన్ నేని, సత్య ఎస్ కె, ప్రణీత పట్నాయక్, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి, బన్నీ వాక్స్, కిషోర్ మారిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించగా, కె ఎస్‌ ఫిల్మ్స్ వర్క్ పతాకంపై కె ఎస్‌ హేమరాజ్‌ దర్శకత్వం వహిస్తూ నిర్మించారు. టీజర్‌, ట్రైలర్‌లో ఆకట్టుకున్న ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథః ఇది ఊటీలో జరిగే కథ. రిచి (సత్య ఎస్ కె) తన పెళ్లి కి సంబంధించిన బ్యాచ్ లర్‌ పార్టీ కోసం ఫ్రెండ్స్ ని ఊటికి పిలుస్తాడు. చిన్న నాటి ఫ్రెండ్స్‌ అందరి జీవితాల్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సీరియల్ హీరోగా నటించే నవీన్‌ మీటూ సమస్యల్లో చిక్కుకోవడం ఇలా అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. ఈ పార్టీలో అందరు తమకు వచ్చే ఫోన్లు లౌడ్ స్పీకర్లు పెట్టి అందరి ముందు ఓపెన్‌గా మాట్లాడాల్సి ఉంటుంది. ఇలా ఒక్కొక్క ఫోన్‌ వస్తుంటే ఒక్కొక్కరి పర్సనల్ సీక్రెట్లన్నీ బయట పడుతుంటాయి. రిచికి ఫ్లాష్ బ్యాక్‌లోనూ ఓ ప్రేమ కథ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ వల్ల రిషికి ఎదురైన సమస్యలు ఏంటి? అసలు ఫ్రెండ్స్ అంతా కలిసి చేసిన పనులేంటి? చివరకు రిషి పెళ్లి జరిగిందా? లేదా? అన్నది చూడాలి.

Latest Videos

undefined

విశ్లేషణః

ఇదొక ఫన్‌, ఎమోషనల్‌, మెసేజ్‌ ఓరియెంటెడ్‌ ఎంటర్‌టైనర్‌. యూత్‌ టార్గెట్‌గా అన్ని అంశాల మేళశింపుగా తెరకెక్కించాడు దర్శకుడు హేమరాజ్‌. ఇదొక డిఫరెంట్‌ మూవీ అని చెప్పొచ్చు. వల్గారిటీ లేకుండా, క్లీన్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కించారు. ఫ్రెండ్స్ లైఫ్‌లో జరిగే సన్నివేశాలను ఫన్నీ వేలో చూపించారు. ఈ క్రమంలో పుట్టే కామెడీ ఆడియెన్స్ కి నవ్వులు పూయించేలా ఉంటుంది. ముఖ్యంగా మానవ సంబంధాలకు అద్దంపట్టేలా ఈ సినిమాని రూపొందించారు. ఫ్రెండ్స్ ఫోన్‌తో సరదా  గేమ్ వల్ల వారి జీవితాల్లో చోటు చేసుకున్న సంఘటనను, ట్విస్ట్ లను లైటర్‌ వేలో చూపించారు. 

సినిమా ఓపినింగ్ సీన్ లోనే సినిమాటోగ్రాఫర్ తన దైన మార్క్ ని చూపించాడు. `రిచి గాడి పెళ్లి` కోసం ఎవ్వరి వాళ్ళ బిజీ లైఫ్ ని వదిలి రిచి ఫ్రెండ్స్ అందరు 'ఊటీ' కి బయలు దేరుతారు. అసలు కథ ఇక్కడే మొదలవ్వుతుంది, లక్ష్మీపతి పాత్ర చేసిన సతీష్‌.. సరదాగా సాగే ఒక గేమ్ కాన్సెప్ట్ లోకి రిచి ఫ్రెండ్స్ అందరిని ఇన్వాల్వ్ చేస్తాడు. ఎవ్వరికైతే కాల్ వస్తుందో లౌడ్ స్పీకర్ ఆన్ చేసి అందరి ముందు మాట్లాడాలి. అలా టీమ్ లో కాల్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి వెనక ఏదొక సీక్రెట్ దాగి ఉంటుంది. ఆ విషయాన్ని ఎంతో సున్నితంగా, కొంత ఫన్నీ వేలో  చెప్పడానికి ప్రయత్నం చేసాడు డైరెక్టర్ హేమరాజ్. ముఖ్యంగా, నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, సతీష్ క్యారెక్టర్ లా బ్యాగ్రౌండ్ స్టోరీస్ ని  ప్రేక్షకులు బాగా ఆకట్టుకునే రీతిలో తీర్చిదిద్దారు. శ్రీమణి, రాసిన నా నిన్నలలో కన్నులలో, అనంత్ శ్రీరామ్ రాసిన “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా” అనే పాటకు థియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. 

ఫస్టాఫ్‌లో కథ ప్రారంభమవడనానికి టైమ్‌ తీసుకున్నారు, దీంతోపాటు స్లోగా సాగడం ఇబ్బంది పెట్టే అంశం. దీంతోపాటు కథ విషయంలో దర్శకుడు మరింత కేర్‌ తీసుకోవాల్సింది. బలంగా, గ్రిప్పింగ్‌గా కథ రాసుకోకపోవడంతో ఆ ఇబ్బంది సినిమాలో కనిపిస్తుంది. అది కాస్త బోరింగ్‌గా, డల్‌గా మారుతుంది. మేకింగ్‌ పరంగానూ తన అనుభవ లేమి కొంత కనిపిస్తుంది. కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్న సీన్లలో క్లారిటీ మిస్‌ అయ్యింది, అక్కడ తడబాటు కనిపిస్తుంది. ఎమోషనల్‌గా ఆడియెన్స్ కి కనెక్ట్ చేయడంలోనూ కొంత లోటు కనిపిస్తుంది. కొన్ని అనవసర సీన్లు సినిమాని డైవర్ట్ చేసేలా ఉంటాయి. ఈ విషయాల్లో దర్శకుడు మరింత కేర్‌ తీసుకుంటే సినిమా ఫలితం మరో స్థాయిలో ఉండేది.

నటి నటులు

సత్య ఎస్ కె తన దైన శైలిలో లవర్ బాయ్ లా యాక్ట్ చేసిన తీరు బాగుంది. స్క్రీన్‌ ప్రజెన్స్ కూడా ఆకట్టుకునేలా ఉంది.ప్రణీత పట్నాయక్ క్యారెక్టర్ చాలా యూనిక్ గా ఉండటంతో పాటు  నటనతో ఆకట్టుకుంది. బన్నీ వాక్స్ రియల్ లైఫ్ లో ఒక యూట్యూబ్ స్టార్. సినిమాలో చాలా హోమ్లీ గా నటిస్తూనే కి రోల్ పోషించింది. నవీన్ నేని ఏ పాత్రలో నైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తాడు. తన పెర్ఫామెన్స్ తో సినిమాకి ఒక బ్యూటీ ని తీసుకొచ్చాడు. లక్ష్మీపతిగా సతీష్ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు. కిషోర్ మారిశెట్టి, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి వంటి వారు ఉన్నంతో ఫర్వాలేదనిపించారు.

సాంకేతిక విభాగం:

రాజేంద్ర వైట్ల & నాగరాజు మధురి అందించిన స్టోరీ కాసేపు స్క్రీన్ మీద ఊరట లభించిన అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపొయ్యారు. స్క్రిప్ట్ విభాగంలో ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకొని ఉంటే నెస్ట్ లెవెల్ ఉండేది కాబోలు. కె.ఎస్. హేమరాజ్ స్క్రీన్ ప్లే & డైరెక్షన్ లో కొత్త వాడే అయ్యిన తన వంతు కృషి చేసాడు. కాకపోతే, అక్కడక్కడ కొన్ని కంటిన్యూటీ, లాజిక్స్ మిస్ అవ్వడం ఇలాంటి వాటి మీద ఇంకాస్త శ్రద్ద వహించాల్సింది. విజయ్ ఉళఘనాథ్ సినిమాటోగ్రఫీ విజ్యువల్ గా సూపర్బ్. మ్యూజిక్ డైరెక్టర్ సత్యన్ పర్వాలేదనిపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. 
ఫైనల్‌గాః మంచి సందేశం, ఫన్‌, డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రమిది. సినిమా నిడివి తక్కువ ఉండటం కలిసొచ్చే అంశం.
రేటింగ్‌ః 2.75


మూవీ టైటిల్: రిచి గాడి పెళ్లి 
రీలిజ్ డేట్: మార్చి 3 2023
నటి నటులు: నవీన్ నేని, సత్య ఎస్ కె, ప్రణీత పట్నాయక్, బన్నీ వాక్స్, కిషోర్ మారిశెట్టి, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి, సతీష్ తదితరులు...
ఎడిటర్: అరుణ్ ఇఎమ్
మ్యూజిక్ డైరెక్టర్: సత్యన్
సినిమాటోగ్రఫీ: విజయ్ ఉళఘనాథ్ 
డైలాగ్స్: రాజేంద్ర వైట్ల 
స్టోరీ: రాజేంద్ర వైట్ల & నాగరాజు మధురి 
కో ప్రొడ్యూజర్: సూర్య మెహర్
ప్రొడ్యూజర్: కె.ఎస్.హేమరాజ్
బ్యానర్: కె.ఎస్. ఫిల్మ్ వర్క్స్ 
స్క్రీన్ ప్లే & డైరెక్షన్: కె.ఎస్. హేమరాజ్

click me!