నన్ను దానికోసం అడిగే ధైర్యం ఎవరూ చేయలేదు-రిచా

Published : May 27, 2017, 01:08 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
నన్ను దానికోసం అడిగే ధైర్యం  ఎవరూ చేయలేదు-రిచా

సారాంశం

దేశవ్యాప్తంగా మరోసారి ఇష్యూగా మారిన కాస్టింగ్ కౌచ్ తాజాగా కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తున్న పలువురు నటీమణులు తనను మాత్రం ఎవరూ అది అడగలేదని చెప్తున్న రిచా గంగోపాధ్యాయ్  

భారీ అందాలతో కుర్రకారును కైపెక్కించిన లీడర్‌' భామ రిచా గంగోపాధ్యాయ్‌. కెరీర్‌లో మిర్చి లాంటి బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమాలో హీరోయిన్ గా నటించింది. తెలుగులోనేకాక తమిళంలోనూ పలు సినిమాల్లో నటించిన రిచా యాక్టింగ్‌ కెరీర్‌కి బ్రేక్ తీసుకుని అమెరికాలో పై చదువులు పూర్తి చేసి గ్రాడ్యుయేట్ పట్టా అందుకుంది. అమెరికాలో వున్నా, తెలుగు, తమిళ సినిమాల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూనే వుందట.

 

రిచా ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలోనే హాట్‌ టాపిక్‌ గా మారిన 'కాస్టింగ్‌ కౌచ్‌' పై తన అనుభవాలు వెల్లడించింది. హీరోయిన్లకు లైంగిక వేధింపులు అనే అంశం చుట్టూ పెద్ద రచ్చే జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై రిచా గంగోపాధ్యాయ స్పందించింది. రిచాకు అలాంటి అనుభవాలు ఏ కోశాన కూడా ఎదురు కాలేదని బల్లగుద్ది చెప్తోంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో అంతా చాలా ప్రొఫెషనల్‌గా వుంటారంటోంది.

 

ఒకవేళ అలాంటి వ్యవహారం జరుగుతున్నా అది తనదాకా రాలేదంటోంది. తాను చాలా స్ట్రిక్ట్‌గా, సీరియస్‌గా వుండేదాన్ని కాబట్టి.. ఎవరూ తనని అలా అడిగే ధైర్యం చేయలేదని అభిప్రాయపడింది రిచా గంగోపాధ్యాయ్‌. 'మనం ధైర్యంగా వుంటే మన జోలికి ఎవరూ రారు.. సినీ పరిశ్రమ అనే కాదు, ఎక్కడైనా మహిళలకు వేధింపులు మామూలే.. పర్టిక్యులర్‌గా సినీ పరిశ్రమలోనే ఇదేదో వుందని అనుకోవడం సబబు కాదు..' అంటూ రిచా, 'కాస్టింగ్‌ కౌచ్‌' పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

 

అనుకోకుండా సినిమాల్లోకి రావడం, సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు వచ్చాక మళ్ళీ చదువుపై దృష్టిపెట్టడం.. ఇలా తన జీవితానికి సంబంధించి పలు అంశాలపై చెప్పిన విషయాలన్ని 'పోయెట్స్‌ అండ్‌ క్వాంట్స్‌'లో ప్రచురితమయ్యాయి. ఇది తన లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అని రిచా వ్యాఖ్యానించింది. సో రిచాకు అలాంటి అనుభవాలు ఎదురు కాలేదంటే.. నమ్మాలి కదా. చెప్తున్నప్పుడు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా