పెళ్లి వార్తలపై మిరపకాయ్ పిల్ల మిర్చి లాంటి వ్యాఖ్యలు

Published : Nov 20, 2017, 01:30 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
పెళ్లి వార్తలపై మిరపకాయ్ పిల్ల మిర్చి లాంటి వ్యాఖ్యలు

సారాంశం

ప్రస్థుతం సినిమాలకు దూరంగా అమెరికాలో వుంటున్న రిచా గంగోపాద్యాయ్ రిచా రహస్యంగా పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో చర్చ పెళ్లి వార్తలపై ట్విటర్ లో ఘాటుగానే స్పందించిన రిచా

ఆకట్టుకునే చలాకీతనం, అందమైన ఫిగర్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రిచా గంగోపాద్యాయ్ ప్రస్థుతం సినిమాలకు దూరంగా అమెరికాలో వుంటోంది. అయితే రిచా రహస్యంగా పెళ్లి చేసుకుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. సినిమాల్లో అవకాశాలు వస్తున్నా, వాటిని కాదని సినీ జీవితానికి పూర్తిగా స్వస్తి పలికిన రిచా ఇప్పుడు అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉంటోంది. అయితే, ఆమె తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకునే అక్కడే సెటిలైపోయిందంటూ.. ఇటీవల సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి.

 

తన పెళ్లి వార్తలపై రిచా ఘాటుగానే స్పందించింది. ‘‘మీ వ్యంగ్య వ్యాఖ్యలు జనానికి అర్థం కాకపోవచ్చు.అందుకే ఇక్కడ స్పష్టత ఇస్తున్నా... నేను పెళ్లి చేసుకోలేదు. ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం కూడా లేదు. ఒక వేళ చేసుకుంటే నేనే నేరుగా చెబుతాను. అయినా తెలుగు మీడియా నా బోరింగ్ లైఫ్ చూసి నిరుత్సాహ పడుతున్నట్లుంది. అందుకే, నాపై మసాలాలను దట్టిస్తోంది. దయచేసి, నాలాంటి సినిమాకు దూరంగా వుంటున్న నటుల జీవితాలను గురించి వదిలేసి, తాజా సినిమా వార్తలపై దృష్టి పెట్టండి’’ అని మీడియాకు సలహా ఇచ్చింది.

 

గత కొంత కాలంగా ఆమె సినిమాలకు ఎందుకు దూరంగా వుంటుందో, అసలు సినీ రంగాన్ని ఆమె ఎందుకంత ఈసడించుకుంటుందో అర్థంకాక ఆమె అభిమానులు కొట్టుకుంటున్నారు. చాలామంది ఆమె సినిమాల్లోకి తిరిగి రావాలని కోరుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Illu Illalu Pillalu Today Episode Dec 22: ధీరజ్ కంట పడిన విశ్వ, అమూల్య.. మరోపక్క వల్లి భయం