
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు సిబిఐ ఎంట్రీతో సరికొత్త మలుపులతో సాగుతుంది. అనేక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా మరో దుమారానికి తెరలేపింది సుశాంత్ సోదరి. సుశాంత్, రియా చక్రవర్తి, సిద్ధార్థ్ పిథాని, శ్యామూల్ మిరిండాల మధ్య జరిగిన వాట్సాఫ్ చాటింగ్‌ని బయటపెట్టింది. ఇప్పుడిది కేసుని మరో మలుపు తిప్పుతోంది. సుశాంత్ గంజాయి తీసుకునే వాడనే ఆరోపణలు వచ్చాయి. దానికిది బలం చేకూరుస్తుంది. అంతేకాదు, దీనికి కారణాలేంటనేది వెల్లడిస్తుంది.
సుశాంత్ డెత్ కేసులో ప్రధానంగా రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కానీ ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని రియా చెబుతోంది. తాజాగా ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సుశాంత్ ఫ్యామిలీపై పలు ఆరోపణలు చేసింది. దీనికి కౌంటర్‌గా సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ స్పందించారు. రియాకి చెందిన పలు వాట్సాప్ చాట్‌లను వెల్లడించింది.
ముఖ్యంగా సుశాంత్‌కి కావాలని డ్రగ్‌ని అలవాటు చేసినట్టుగా వెల్లడించింది. రియా, ఆమె సోదరుడు షోయుక్ చక్రవర్తి, సిద్ధార్థ్ పిథాని, శ్యాముల్ మిరిందాల మధ్య జరిగిన సంభాషణ, అందులో సుశాంత్‌కు డ్రగ్ ఇవ్వడం లాంటి విషయాలను శ్వేతా బయటపెట్టారు. ఎన్‌ఐఎఫ్‌డబ్ల్యూ పేరుతో ఉన్న ఈ వాట్సాప్ గ్రూప్‌లో రియా, ఆమె సోదరుడు షోయుక్, సిద్ధార్థ్ పిథాని సహా మరికొందరు ఉన్నారు. ఇందులో డూబీగా పిలుచుకునే గంజాయి ఇవ్వండని షోయుక్ అడగ్గా ఇప్పుడే సుశాంత్ తీసుకున్నాడని పిథాని సమాధానం చెప్పడం, గతేడాది జులై 30న మరొక చాట్‌లో డూబీ కావాలని రియా అడగ్గా మరొకరు రోలింగ్, గెట్లింగ్ అనే సమాధానం వచ్చింది. ఇందులో ఎక్కువగా గంజాయి సుశాంత్‌కి ఇవ్వడానికి సంబంధించే ఎక్కువగా చర్చ జరిగింది.
వీరి మధ్య జరిగిన వాట్సాప్ చర్చకి సంబందించిన స్క్రీన్ షాట్లని సుశాంత్ సోదరి శ్వేతా సోషల్ మీడియాలో బహిర్గతం చేసింది. దోషులను అరెస్ట్ చేయండని ఓ క్యాప్షన్ పెట్టింది. మరోవైపు తమ కుటుంబంపై రియా చేస్తున్న ఆరోపణలను శ్వేతా సింగ్ ఖండించారు. అందులో ఏమాత్రం నిజం లేదని తెలిపింది. సుశాంత్‌ని ప్రేమ పేరుతో రియా వాడుకుందని, ప్రతీ నెల 17వేల రూపాయల ఈఎంఐలు కట్టుకునే సాధారణ మధ్య తరగతి కుటుంబంలోని రియాకు దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్‌ని ఎలా పెట్టుకోగలిగిందంటూ ప్రశ్నించింది.
మరి సుశాంత్ సోదరి ఆరోపణలకు రియా ఎలా స్పందిస్తుంది? తాజా వాట్సాప్ చాట్ ఈ కేసుని ఇంకెన్ని మలుపులు తిప్పుతుందో చూడాలి. ఇదిలా ఉంటే జూన్ 14న సుశాంత్ తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సిబిఐ విచారణ జరుపుతోంది.