ఈడీకి రియా షాక్‌.. ఆస్తులడిగితే లెటర్‌ ముందు పెట్టింది!

Published : Aug 08, 2020, 06:30 PM IST
ఈడీకి రియా షాక్‌.. ఆస్తులడిగితే లెటర్‌ ముందు పెట్టింది!

సారాంశం

సుశాంత్ మృతిపై మొద‌టినుంచి ప‌లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రధానంగా రియాని నిందితులుగా అనుమానిస్తున్నారు. దీంతో ఆమెపై సీబీఐ సైతం కేసు నమోదు చేసింది. విచారణకు సిద్దమవుతుంది. అంతకంటే ముందు ఈడీ ఆమెని విచారించింది. 

ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులకు బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి షాక్‌ ఇచ్చింది. సుశాంత్‌ కి చెందిన కోట్ల డబ్బుని కొట్టేసిందని ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో ఈడీ ఆమెని శుక్రవారం విచారించింది. అయితే ఈడీ అధికారులు సైతం షాక్‌కి గురయ్యేలా ఓ లెటర్‌ని వాళ్ళముందుంచింది. ఇదే ఆయన్నుంచి తీసుకున్న ఆస్తి అని బుకాయించింది. అది చూసి అవ్వాక్కవడం ఈడీ అధికారుల వంతయ్యింది. మరి ఇంతకి వాళ్లెమడిగారు, రియా ఏం చెప్పిందనేది చూస్తే.. 

సుశాంత్ మృతిపై మొద‌టినుంచి ప‌లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రధానంగా రియాని నిందితులుగా అనుమానిస్తున్నారు. దీంతో ఆమెపై సీబీఐ సైతం కేసు నమోదు చేసింది. విచారణకు సిద్దమవుతుంది. అంతకంటే ముందు ఈడీ ఆమెని విచారించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా శుక్రవారం ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. సుశాంత్‌ అకౌంట్‌ నుంచి రియా దాదాపు 15 కోట్ల రూపాయల మేర తన అకౌంట్‌కు బదిలీ చేయించుకుందని అతడి తండ్రి కేకే సింగ్‌ ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో రియాతోపాటు ఆమె కుటుంబ సభ్యుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సుమారు తొమ్మిది గంటలపాటు ఈడీ అధికారులు ఆమెని విచారించారు. ఈ సందర్భంగా అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు.  

ఈ సందర్భంగా రియా ఈడీ అధికారులను బకరా చేసింది. సుశాంత్‌కి సంబంధించిన ఆస్తి కేవ‌లం త‌ను రాసిన లెట‌ర్ మాత్ర‌మేన‌ని తెలిపింది. ఇందులో సుశాంత్ రాసిన‌ట్లుగా
ఉన్న ఓ లేఖ‌ను ఆమె విడుద‌ల చేశారు. లేఖ‌లో 'నా జీవితం ప‌ట్ల కృతజ్ఞుడిని.. లిల్లు (షోయుక్ చ‌క్ర‌వ‌ర్తి ), బెబు (రియా), స‌ర్ (రియా తండ్రి), మ్యాడ‌మ్ (రియా త‌ల్లి ), ఫ‌డ్జ్
(సుశాంత్ పెంపుడు కుక్క‌)  నా  జీవితంలో ఉన్నందుకు  నేను కృతజ్ఞుడిని' అని సుశాంత్ రాసిన లెట‌ర్‌ను ఈడీ ముందుంచారు. అయితే ఈ లెట‌ర్లో వాస్తవమెంతా అనే
కోణంలోనూ విచారిస్తున్నారు.

అంతేకాకుండా రియాకు ఈ లెట‌ర్ ఎక్క‌డినుంచి వ‌చ్చింద‌న్న‌ది కూడా స్ప‌ష్టం కాలేదు. ప్ర‌స్తుతం త‌న ద‌గ్గ‌ర సుశాంత్ రాసిన‌ట్లుగా ఉన్న ఈ లెట‌ర్, త‌ను వాడిన వాట‌ర్ బాటిల్
మాత్ర‌మే ఉన్నాయ‌ని, ఇవే సుశాంత్ నుంచి తీసుకున్న ఆస్తి అని రియా పేర్కొన్నారు. సుశాంత్ నుంచి తానెప్పుడూ డ‌బ్బు తీసుకోలేద‌ని,  ప్ర‌తీ అవ‌స‌రానికి త‌న ఆదాయం
నుంచే ఖ‌ర్చు చేశాన‌ని ఈడీ అధికారులకు తెలిపారు. దీంతో ఆమెపై ఆరోపణలకు, ఆమె చెబుతున్న సమాధానాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి