
రామ్ గోపాల్ వర్మ ఈ పేరు వింటే ఒకప్పుడు హైటెక్నికల్ వ్యాల్యూస్ తో కూడిన ట్రెండ్ సెట్టర్ సినిమాలు గురించి చెప్పేవారు.. ఇప్పుడేమో వర్మ అంటే ఫ్లాప్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ తో క్రేజ్ తెచ్చుకున్న ఆయన ఆ సినిమా రిలీజ్ లోగా మరో సినిమాను పట్టాలు ఎక్కిస్తున్నట్లు సమాచారం. ఆ మధ్యన ఆయన ఫ్లో కామ్ టెక్నాలజీ అంటూ ‘ఐస్ క్రీమ్’ అనే సినిమాని తీసి థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ కి బ్యాడ్ ఎక్సపీరియన్స్ ని మిగిల్చాడు.
ఆ తర్వాత అడ్వాన్స్ ఫ్లో కామ్ అంటూ ‘ఐస్ క్రీమ్’కి సీక్వెల్ అంటూ ‘ఐస్ క్రీమ్ 2’ సినిమా తీసాడు. నందు, నవీన, జెడి చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సీక్వెల్ మొదటి దానికన్నా ఛండాలంగా ఉందని పేరు తెచ్చుకుంది. అయితే పెద్దగా ఖర్చు లేకుండా తీసిన సినిమా కావటంతో ఎవరికీ నష్టాలు రాలేదు. ఇప్పుడు అదే ఊపులో ..ఐస్ క్రీమ్ 3 ప్రాజెక్టుని ప్రారంభిస్తున్నట్లు సమాచారం.
అందుతున్న సమాచారం మేరకు ఈసారి ఐస్ క్రీమ్ -3 బాధ్యతల్ని వర్మ తన శిష్యుడికి అప్పగించినట్లు తెలుస్తోంది. వర్మ కంపెనీ ప్రొడక్షన్స్ లో ఐదేళ్లుగా పనిచేస్తోన్న అక్షయ్ అనే కుర్రాడిని డైరెక్ట్ చేయమని చెప్పాడట.
కథ, కథనం, డైలాగులు ఇప్పటికే సిద్దం చేసి... దర్శకత్వ పర్యవేక్షణ మాత్రం వర్మ చూసుకోనున్నారట. అలాగే నిర్మాతగా యధావిధిగా తుమ్మలపల్లి కొనసాగనున్నారుట. మొత్తానికి తుమ్మలపల్లి పేరు మరోసారి `ఐస్ క్రీమ్-3` తో మార్మోగిపోవడం ఖాయం.