పవన్‌కి వెన్నుపోటు తప్పదు.. ఆర్జీవి వివాదాస్పద పోస్ట్.. ఆడుకుంటున్న పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్

Published : Jan 28, 2023, 04:18 PM ISTUpdated : Jan 28, 2023, 05:26 PM IST
పవన్‌కి వెన్నుపోటు తప్పదు.. ఆర్జీవి వివాదాస్పద పోస్ట్.. ఆడుకుంటున్న పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్

సారాంశం

ఎప్పుడూ పవన్‌ని టార్గెట్‌గా చేస్తూ పోస్టులు పెట్టే వర్మ.. తాజాగా మరోసారి షాకింగ్‌ కామెంట్ చేశారు రామ్‌గోపాల్‌ వర్మ. ఆ ఇద్దరు మోసం చేయడం పక్కా అంటూ కామెంట్‌ చేశారు.

వివాదాస్పద, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. తరచూ వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలుస్తుంటాడు. తనని మర్చిపోతున్నారనుకునే సమయంలోనో, లేదా తనకు అవసరం ఉందనుకునే సమయంలోనే ఏదో ఒక విషయంలో ట్వీట్లు పెడుతూ చర్చనీయాంశం అవుతుంటాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌, చంద్రబాబు నాయుడు, చిరంజీవి వంటి పాపులర్‌ వ్యక్తులను టార్గెట్‌గా పోస్ట్ లు పెడుతూ సోషల్‌ మీడియాలో రచ్చ లేపుతుంటాడు. 

ఎప్పుడూ పవన్‌ని టార్గెట్‌గా చేస్తూ పోస్టులు పెట్టే వర్మ.. తాజాగా మరోసారి షాకింగ్‌ కామెంట్ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ని చంద్రబాబు నాయుడు, నాదెండ్ల మనోహర్‌ కలిసి వెన్నుపోటు పొడవబోతున్నట్టు తెలిపి షాకిచ్చాడు. తాజాగా వర్మ ట్విట్టర్‌లో పేర్కొంటూ, `ఆనాడు జూలియస్‌ సీజర్‌ని బ్రూటస్‌, ఎన్టీఆర్‌ని నాదెండ్ల భాస్కర్రావు, ఎన్టీఆర్‌ ని మళ్లీ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచినట్టే, ఈ సారి పవన్‌ కళ్యాణ్‌ని.. నాదెండ్ల మనోహర్‌, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వెన్నుపోటు పొడుస్తారని రాత్రి నాకు కలలో దేవుడు చెప్పాడు` అని ట్వీట్‌ చేశాడు వర్మ. ఇది సోషల్‌ మీడియాలో రచ్చ లేపుతుంది. 

దీనికి కంటిన్యూగా మరో ట్వీట్‌ వదిలారు వర్మ. పవన్‌ని వెన్నుపోటుదారులకు దూరంగా ఉండాలని చెప్పండి అంటూ ఫ్యాన్స్ ని కోరారు వర్మ. `ప్రియమైన జనసైనికుల్లారా దయచేసి మన లీడర్ ని, వెన్నుపోటు నాదెండ్ల భాస్కర్‌ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్‌కి దూరంగా ఉండమని చెప్పండి, ఇంతకు ముందు `పవనిజం` పుస్తకం రాసిన రాజురవితేజ గురించి ఇలానే వార్నింగ్‌ ఇచ్చాను. నా మాటే నిజమైంది` అని తెలిపారు వర్మ. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నారు. 

దీనిపై పవన్‌ ఫ్యాన్స్ స్పందిస్తూ, వర్మకి వార్నింగ్‌కి, సెటైర్లు వేస్తున్నారు. దేవుడిని నమ్మని నీకు దేవుడు ఎలా వచ్చాడురా, ముందు నువ్వు మీ భార్య, కూతులకు వెన్నుపోటు పొడిచావు అది చూసుకోవాలని, అదే జరిగితే రాష్ట్రం తగలబడిపోతుందన్నారు. తెలుగు ఆడియెన్స్ ని నానా విధాలుగా మెంటల్‌ ఎక్కిస్తున్న వర్మని మంచి డాక్టర్కి చూపించాలని సెటైర్లు పేలుస్తున్నారు. వర్మని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. 

పవన్‌ కళ్యాణ్‌ని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోబోతున్నట్టు ప్రచారంజరుగుతుంది. ఆ మధ్య వీరిద్దరు కలిసి చర్చించుకున్నారు. టీడీపీ, జనసేన పోత్తు పెట్టుకోబోతుందని తెలుస్తుంది. మరోవైపు ఇటీవల పవన్‌ మాట్లాడుతూ, బీజీపీతో కలిసే ఉన్నామని, కలిసి వచ్చే పార్టీలతో ముందుకు సాగుతామని చెప్పొచ్చు. తన వారాహి వాహనంపై ప్రచారం షురూ చేసిన విషయం తెలిసిందే. ఓ రోజు కొండగట్టులో ప్రత్యేక పూజలు చేసి ఈ వారాహి వాహనాన్ని ప్రకటించారు. అలాగే బెడవాడ కనకదుర్గని కూడా సందర్శించారు పవన్‌. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ram charan మీద దేశాలు దాటిన ప్రేమ, మెగా పవర్ స్టార్ కోసం ఇండియా వచ్చిన ఫారెన్ అభిమానులు
పొగరు అనుకున్నా పర్లేదు.! రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ఆఫర్ అందుకే రిజెక్ట్ చేశా