కమ్మరాజ్యంలో కడపరెడ్లు: 'బాబు చంపేస్తాడు' సాంగ్ రిలీజ్ చేసిన వర్మ!

Published : Sep 24, 2019, 06:11 PM IST
కమ్మరాజ్యంలో కడపరెడ్లు: 'బాబు చంపేస్తాడు' సాంగ్ రిలీజ్ చేసిన వర్మ!

సారాంశం

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నుంచి వస్తున్న మరో చిత్రం కమ్మరాజ్యంలో కడపరెడ్లు. ఈసారి వర్మ కాస్ట్ ఫీలింగ్ అంశాన్ని తన సబ్జెట్ గా ఎంచుకున్నాడు. కాట్రవర్సీ లేనిదే వర్మ సినిమా ఉండదు. 

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నుంచి వస్తున్న మరో చిత్రం కమ్మరాజ్యంలో కడపరెడ్లు. ఈసారి వర్మ కాస్ట్ ఫీలింగ్ అంశాన్ని తన సబ్జెట్ గా ఎంచుకున్నాడు. కాట్రవర్సీ లేనిదే వర్మ సినిమా ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో రెండు కులాల పేర్లని టైటిల్ లో పెట్టిన వర్మ సోషల్ మీడియా వేదికగా రచ్చ ప్రారంభించాడు. 

రాంగోపాల్ వర్మ ఈ ఏడాది లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో సందడి చేశాడు. ఎన్టీఆర్, లక్ష్మి పార్వతి మధ్య బంధం ఆధారంగా వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం మెప్పించలేకపోయింది. ప్రస్తుతం వర్మ తెరకెక్కిస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అనే చర్చ జరుగుతోంది. 

తాజాగా ఈ చిత్రంలోని 'బాబు చంపేస్తాడు' అనే పాటని వర్మ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశాడు. ఈ సాంగ్ వీడియోలో  జగన్, చంద్రబాబు, విజయసాయి రెడ్డి, అంబటి రాంబాబు, నారా లోకేష్ లాటి ప్రముఖ రాజకీయ నాయకుల దృశ్యాలు కనిపిస్తున్నాయి. 

కమ్మరాజ్యంలో కడపరెడ్లు చిత్రం పూర్తిగా కల్పితం. ఈ చిత్రంలో పాత్రలు నిజజీవితంలో ఎవరినైనా పోలి ఉంటే నాకు సంబంధం లేదు అంటూ సెటైరికల్ గా వర్మ ట్వీట్ చేశాడు. 

 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌