పవన్ తో డేట్ కి వెళతా... నగ్నం బ్యూటీ బోల్డ్ కామెంట్స్

Published : Jul 08, 2020, 07:48 AM ISTUpdated : Jul 08, 2020, 07:53 AM IST
పవన్ తో డేట్ కి వెళతా... నగ్నం బ్యూటీ బోల్డ్ కామెంట్స్

సారాంశం

ఇటీవల విడుదలైన నగ్నం సినిమాలో హీరోయిన్ స్వీటీ... వరస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతోంది. కాగా..ఈ ఇంటర్వూలలో ఆమె జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై బోల్డ్ కామెంట్స్ చేసింది.

కరోనా లాక్ డౌన్ సమయంలోనూ వరసగా సినిమాలు చేస్తూ.. సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. క్లైమాక్స్, నగ్నం వంటి  సినిమాలు తీసి.. వాటిని ఓటీటీలో విడుదల చేసి ఆయన సొమ్ము చేసుకుంటున్నారు. కాగా.. ఇటీవల విడుదలైన నగ్నం సినిమాలో హీరోయిన్ స్వీటీ... వరస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతోంది. కాగా..ఈ ఇంటర్వూలలో ఆమె జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై బోల్డ్ కామెంట్స్ చేసింది.

పవన్ కల్యాణ్ అంటే క్రష్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు అతనితో డేటింగ్‌కి కూడా రెడీ అంటుంది.ఆమె మాట్లాడుతూ.. ‘‘నాకు తెలుగు సినిమా హీరోల్లో పవన్ కల్యాణ్ అంటే క్రష్. అప్పట్లో ఆయనను కలవాలని రెండు మూడు సార్లు ట్రై చేశాను కూడా. కానీ కుదరలేదు. ఇక ప్రయత్నం చేయలేదు. ఆయనని కలవడం కోసం ఎవ్వరినీ అడగడం నాకు ఇష్టం లేదు. అందుకే ఎవరినీ అడగలేదు. మనసులో ఒక్కటే అనుకున్నా. ఆయనని కలవాలని ఉంటే ఖచ్చితంగా ఎప్పటికైనా కలుస్తాను అని. ఆయనంటే ఎంత ఇష్టం అంటే.. ఆయనతో డేటింగ్‌కు వెళ్లడానికి కూడా రెడీ. ఆయన పిలిస్తే అస్సలు ఆలోచించను. ఆయనతో కలిసి ఒక్క సినిమాలోనైనా నటించాలని ఉంది..’’ అని శ్రీరాపాక (స్వీటీ) తెలిపింది. 

ఇటీవల ఆమె నందమూరి బాలకృష్ణపై కూడా కామెంట్స్ చేసింది. బాలయ్య మహిళా ఆర్టిస్టులను అది, ఇది అంటూ సంభోదిస్తారని ఆమె పేర్కొన్నారు. తాను సినిమా విషయంలో బాలయ్య ఇంటికి వెళ్లినట్లు చెప్పింది. తనని చూసి బాలకృష్ణ నార్త్ అమ్మాయినని అనుకున్నారని పేర్కొంది.
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?