వర్మ 'దిశ.. ఎన్‌కౌంటర్‌' ట్రైలర్ లో ఆ విషయం గమనించారా?

Surya Prakash   | Asianet News
Published : Sep 27, 2020, 11:29 AM IST
వర్మ  'దిశ.. ఎన్‌కౌంటర్‌' ట్రైలర్ లో ఆ విషయం గమనించారా?

సారాంశం

ఈ ట్రైలర్‌ని ఇప్పటికే 20 వేల మందికి పైగా చూశారు. నవంబర్‌ 26న చిత్రం విడుదల కానుంది. ​​​​​​నట్టీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ పై ఆనంద్‌ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సోనియా ఆకుల ప్రవీణ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. అనురాగ్‌ కాసర్ల నిర్మతగా వ్యవహరిస్తున్నారు.

గత ఏడాది సంచలనం రేపిన‌ దిశ హత్యాచారం కేసు, అందులో  నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో హతమైన ఘటన సంగతి తెలిసిందే. దాని ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న సినిమా 'దిశ.. ఎన్‌కౌంటర్‌'. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది.  ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. అలాగే ఈ ట్రైలర్ లో ఆయన పూర్తిగా ఆ రోజు జరిగన సంఘటన మొత్తం చెప్పేసారు. దాంతో తెరమీద ఆయన ఏం చూపెడతారు అనేది చర్చనీయాంశంగా మారింది. 

02:44 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ నవంబర్‌ 26 ఉదయం 6:10 గంటలకు ప్రారంభం అవుతుంది. రోడ్డు పక్కన స్కూటీని పార్క్‌ చేసిన దిశపై అక్కడే ఉన్న నలుగురు లారీ డ్రైవర్ల కన్ను పడుతుంది. ఆ నిమిషమే వారి బుర్రలో విష బీజం నాటుకుంది.

 సాయంత్రం 7 గంటల ప్రాంతంలో స్కూటీని పంచర్‌ చేస్తారు. సాయం కోసం రోడ్డు మీద నిల్చున్న దిశను కిడ్నాప్‌ చేసి లారీలో తీసుకెళ్తారు. ఆమెను దారుణంగా రేప్‌ చేసి.. అనంతరం మృతదేహాన్ని తీసుకొచ్చి పెట్రోల్‌ పోసి తగలబెడతారు. ఇది జరుగుతున్న సమయంలో ఓ పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం అక్కడి నుంచి వెళ్లడంతో ముగుస్తుంది.ఆ ఘటనలకు సంబంధించిన అంశాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి.

ఆపై విచారణ నిమిత్తం పోలీసులు రావడం వరకు వర్మ ఈ ట్రైలర్‌లో చూపించారు. ఈ సినిమాను నట్టి కరుణసమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.'దిశ' ఘటన జరిగిన నవంబర్‌ 26 తేదీనే ఈ సినిమాను విడుదల చేస్తానని వర్మ ఇప్పటికే తెలిపారు.   

PREV
click me!

Recommended Stories

Taapsee Pannu Fitness: అమ్మాయిలూ ఈ తప్పు అస్సలు చేయొద్దు.. జీవితాంతం బాధపడతారు
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..