మోడీకి చెప్పమన్నారుగా.. ఆపరేషన్ సిందూర్ పై ఆర్జీవీ కామెంట్స్ చూశారా ?

Published : May 07, 2025, 09:18 PM IST
మోడీకి చెప్పమన్నారుగా.. ఆపరేషన్ సిందూర్ పై ఆర్జీవీ కామెంట్స్ చూశారా ?

సారాంశం

పహల్గాం ఉగ్ర దాడికి భారత సైన్యం సరైన రీతిలో మంగళవారం అర్ధరాత్రి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లలో 9 ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెరుపు దాడి చేసింది.

పహల్గాం ఉగ్ర దాడికి భారత సైన్యం సరైన రీతిలో మంగళవారం అర్ధరాత్రి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లలో 9 ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెరుపు దాడి చేసింది. నిమిషాల వ్యవధిలో ఉగ్ర స్థావరాలు నేలమట్టం అయ్యాయి. దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి.

ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై దేశ ప్రజల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. అదేవిధంగా సినీ రాజకీయ క్రీడా ప్రముఖులంతా భారత సైనికుల ధైర్య సాహసాలను అభినందిస్తూ.. ఆపరేషన్ సిందూర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్ లాంటి ప్రముఖులంతా సైనికులకి మద్దతు తెలుపుతూ పోస్ట్ చేశారు.

తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఆపరేషన్ సిందూర్ గురించి కామెంట్స్ చేశారు. వర్మ చేసిన కామెంట్స్ పాక్ ఉగ్రవాదులపై సెటైరికల్ గా ఉన్నాయి. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు ఒక మహిళ భర్తని చంపి.. వెళ్లి మోడీ కి చెప్పు అని అన్నారు. ఇప్పుడు ఆ మహిళ నిజంగానే మోడీకి చెప్పింది అంటూ రాంగోపాల్ వర్మ పోస్ట్ చేశారు.

పహల్గాం దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటినుంచి ఇండియా.. పాక్ ఉగ్రవాదులపై ఎప్పుడు ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది అని ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఎదురుచూశారు. నిజంగానే ఇండియన్ ఆర్మీ మిస్సైల్స్ తో ఎయిర్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదుల్ని తుద ముట్టించింది. సరైన ప్రతీకారం తీర్చుకుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే