కిరణ్ అబ్బవరం భార్య రహస్య గోరక్ బేబీ బంప్ ఫోటోస్.. వైరల్

Published : May 07, 2025, 02:27 PM IST
కిరణ్ అబ్బవరం భార్య రహస్య గోరక్ బేబీ బంప్ ఫోటోస్.. వైరల్

సారాంశం

యువ నటుడు కిరణ్ అబ్బవరం, అతని భార్య రహస్య గోరక్ తల్లిదండ్రులు కాబోతున్నట్టు ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

యువ నటుడు కిరణ్ అబ్బవరం, అతని భార్య రహస్య గోరక్ తల్లిదండ్రులు కాబోతున్నట్టు ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కిరణ్ అబ్బవరం తొలి చిత్రం రాజావారు రాణిగారులో రహస్య హీరోయిన్ గా నటించారు.  తాజాగా రహస్య గోరక్ తన సోషల్ మీడియా ఖాతాలో బేబీ బంప్‌తో ఉన్న అందమైన ఫోటోను షేర్ చేయగా, అభిమానుల నుండి, సినీ వర్గాల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఫోటోలో రహస్య గోరక్ తల్లి కాబోతున్న సంతోషంలో మెరిసిపోతూ కనిపించింది. ప్రస్తుతం రహస్య నిండు గర్భిణి. చూస్తుంటే ఆమెకి సీమంతం జరిగినట్లు ఉంది. అందుకే పట్టు చీర ధరించి బేబీ బంప్ తో ఆమె అందంగా కనిపిస్తున్నారు. 

కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ లవ్‌స్టోరీ 2019లో విడుదలైన రాజా వారూ రాణి గారు సినిమా సెట్స్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రంతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఐదేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట, 2024 ఆగస్టులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

సినీ రంగానికి వస్తే, కిరణ్ అబ్బవరం చివరిగా నటించిన దిల్‌రుబా ఈ ఏడాది మార్చిలో విడుదల అయింది. ప్రస్తుతం ఆయన కె ర్యాంప్ అనే మాస్ ఎంటర్‌టైనర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా గురించి అధికారిక వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, రహస్య గోరక్ తల్లి కాబోతున్న సంగతిని అభిమానులు ఆనందంతో స్వాగతిస్తున్నారు. ఆమె బేబీ బంప్ ఫొటో ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సందేశాలు పంపుతున్నారు. గత ఏడాది కిరణ్ అబ్బవరం క చిత్రంతో సంచలన విజయం అందుకున్నాడు. పునర్జన్మలు, కర్మ సిద్ధాంతం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే