రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. సీఎం జగన్ టార్గెట్ గా పవన్ స్పీచ్? సర్వత్రా ఉత్కంఠ!

Published : Sep 25, 2021, 08:31 PM IST
రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. సీఎం జగన్ టార్గెట్ గా పవన్ స్పీచ్?  సర్వత్రా ఉత్కంఠ!

సారాంశం

రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా ఈవెంట్ గా కాకుండా, పొలిటికల్ ఈవెంట్ గా జనసేన కార్యకర్తలు మార్చేశారు. వైసీపీ వెర్సస్ జనసేన అన్నట్లుగా మారిన ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్(Pawan kalyan) సీఎం జగన్(CM jagan) టార్గెట్ గా ఎలాంటి కామెంట్స్ చేస్తారో చూడాలి.   


సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించిన పొలిటికల్ థ్రిల్లర్ రిపబ్లిక్. అక్టోబర్ 1న గ్రాండ్ గా విడుదల కానుండగా నేడు ప్రీ రిలీజ్ వేడుక ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జెఆర్సి కన్వెన్షన్ హాల్ లో సాయంత్రం ఆరు గంటలకు వేడుక మొదలైంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వస్తుండగా, ఫ్యాన్స్ తో వేదిక సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో పవన్ గురించి, సాయి ధరమ్ సినిమా గురించి మాట్లాడాలని ఫ్యాన్స్ కి మైక్ ఇవ్వగా వారు పొలిటికల్ కామెంట్స్ చేశారు. వైసీపీ కార్యకర్తలపై బూతు కామెంట్స్ చేశారు. 


అదే సమయంలో ఏపీలో సినిమా టికెట్స్ రేట్లు, ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలు  విషయంలో సీఎం జగన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ సాగే అవకాశం కలదని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. రిపబ్లిక్ సినిమా డైరెక్టర్ దేవా కట్టా సైతం ప్రభుత్వ పోర్టల్ ద్వారా సినిమా టికెట్స్ అమ్మడం తప్పు అంటూ ఖండించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కి వ్యతిరేకంగా పవన్ ఎలాంటి కామెంట్స్ చేయనున్నారనే ఆసక్తి రాజకీయ సినీ వర్గాలలో మొదలైంది. 


మొత్తంగా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా ఈవెంట్ గా కాకుండా, పొలిటికల్ ఈవెంట్ గా జనసేన కార్యకర్తలు మార్చేశారు. వైసీపీ వెర్సస్ జనసేన అన్నట్లుగా మారిన ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్(Pawan kalyan) సీఎం జగన్(CM jagan) టార్గెట్ గా ఎలాంటి కామెంట్స్ చేస్తారో చూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు