వారంతా పనీపాటా లేని మూర్ఖులే.. రేణుదేశాయ్ ఘాటు వ్యాఖ్యలు!

Published : Mar 02, 2019, 03:19 PM IST
వారంతా పనీపాటా లేని మూర్ఖులే.. రేణుదేశాయ్ ఘాటు వ్యాఖ్యలు!

సారాంశం

పవన్ కళ్యాణ్ నుండి విడిపోయిన తరువాత నుండి సోషల్ మీడియాలో రేణుదేశాయ్ చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. 

పవన్ కళ్యాణ్ నుండి విడిపోయిన తరువాత నుండి సోషల్ మీడియాలో రేణుదేశాయ్ చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల ఆమె కర్నూలు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అదే ప్రాంతంలో పవన్ కళ్యాణ్ కూడా పర్యటించడంతో రేణు పర్యటన హాట్ టాపిక్ గా మారింది. అయితే తన పర్యటనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని రేణు క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఆమెపై కామెంట్లు వస్తూనే ఉన్నాయి.

దీంతో మరోసారి ఆ కామెంట్లకు ఘాటుగా బదులిచ్చింది. ''పవన్ కళ్యాణ్ గారు, నేను ఒకేసారి కర్నూలు జిల్లాలో పర్యటించడం వలన అనేక ఊహాగానాలు  వినిపిస్తున్నాయని, పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారని'' మండిపడింది. 

తన పర్యటనకి సంబంధించిన ప్లానింగ్ రెండు నెలల క్రితమే జరిగిందని చెప్పింది. నిజానికి వారం రోజుల ముందుగానే రేణు పర్యటనకు వెళ్లాల్సిందట. కానీ పరిస్థితులు అనుకూలించక ఆలస్యంగా వెళ్లిందట. అదే సమయానికి పవన్ కూడా రావడం యాదృచ్చికంగా జరిగిందని తెలిపింది. రైతుల సమస్యల గురించి తాను చేస్తోన్న సినిమాలో భాగంగా కర్నూలుకి వెళ్లినట్లు మరోసారి స్పష్టం చేసింది రేణు.

ఒకవేళ తాను ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలనుకుంటే అది సీక్రెట్ గా ఎందుకుంటుందని ప్రశ్నించింది. ఈ విషయం గురించి అనవసరమైన కామెంట్స్ చేసేవారంతా పనీపాటా లేని మూర్ఖులని, బుద్దిలేని వారంటూ ఘాటుగా స్పందించింది. 
  

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!