
ప్రముఖ నటి, రచయిత రేణు దేశాయ్ తాజాగా సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటు హక్కు గురించి నెటిజన్లు తనకు ఇచ్చే సలహాలు సూచనలపై మండిపడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు కొందరు ఓటు వేసిన అనంతరం సోషల్ మీడియాలో రేణు వాల్ పై ఫోటోలు పెట్టి ఆమెని విసిగించారు.
దీంతో ఆమె వారిపై ఘాటుగా స్పందించింది. తనకు ఎలా ఓటు వేయాలో.. ఎవరికీ ఓటు వేయాలో చెప్పాల్సిన అవసరం లేదని నెటిజన్లకు చెప్పింది. తన ఓటు హక్కుని పూణేలో ఏప్రిల్ 23న వినియోగించుకొబోతున్నట్లు చెప్పింది.
దయచేసి తనకు మెసేజ్ లు పెట్టడం ఆపాలని కోరింది. అలానే ఓటు హక్కు ప్రాధాన్యం గురించి లెక్చర్లు ఇవ్వడం ఆపండని చెప్పింది. తనకు నచ్చిన వ్యక్తికి, పార్టీకి ఈ నెల 23న ఓటు వేస్తున్నట్లు కాస్త గట్టిగా సమాధానం చెప్పింది. ప్రస్తుతం రేణు రైతు సమస్యల మీద ఓ సినిమా తీయడానికి రెడీ అవుతోంది.