కరోనా కారణంగా ఏడాదికి పైగా షూటింగ్ ఆగిపోయింది. నాలుగు నెలల్లో సినిమా షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేయాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల సామ్రాజ్యాల నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.
పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఏఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా..రిలీజ్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ గా కనిపిస్తాడు. 'భీమ్లా నాయక్' స్టార్ 'హరి హర వీర మల్లు' షూటింగ్ వచ్చే నెల ప్రారంభంలో పునఃప్రారంభించనున్నారు. ఈ నేపధ్యంలో ‘హరి హర వీర మల్లు’ దసరా పండుగకు థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
కరోనా కారణంగా ఏడాదికి పైగా షూటింగ్ ఆగిపోయింది. నాలుగు నెలల్లో సినిమా షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేయాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల సామ్రాజ్యాల నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.
ముందుగా హరిహర వీరమల్లు సినిమాను 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ షూటింగ్ లేట్ అవడంతో పాటూ...అదే సమయానికి పవన్ కళ్యాణ్ మరో మూవీ ‘భీమ్లా నాయక్’ విడుదల చేసారు. మాస్‌లోకి ‘భీమ్లా నాయక్’వెళ్లిపోయింది. హరిహర వీరమల్లులో పవన్ కళ్యాన్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని టాక్. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ మధ్యే కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండేజ్ కూడా స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని టాక్. విలన్‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ నటిస్తున్నారు సంగీతం: కీరవాణి, మాటలు: సాయి మాధవ్ బుర్రా, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్ వి.ఎస్.