
బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన కోడలు, ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన మార్క్లే(Meghan Markle), హాలీవుడ్ నటుడు సిమన్ రేక్స్(Cimon Rex) కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. నటి మేఘన్‌తో ఒక రాత్రి గడిపాననే విషయాన్ని చెప్పాలని బ్రిటన్ మీడియా ఒత్తిడి తెచ్చిన విషయాన్ని తాజాగా బయటపెట్టి సంచలనానికి తెరలేపాడు నటుడు సిమన్ రేక్స్. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్‌తోపాటు సంచలనంగా మారింది. మరి ఆయన్ని ఎందుకు టార్గెట్ చేశారు? అసలేం జరిగిందనేది చూస్తే..
అమెరికా నటిగా పాపులర్ అయ్యింది మేఘన్ మార్ల్కే. ఆమెని బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ 2018లో వివాహమాడిని విషయం తెలిసిందే. హ్యారీతో మ్యారేజ్ జరిగాక బ్రిటన్ రాజకుటుంబంలో ఆమె జాతి వివక్షని ఎదుర్కొన్నట్టు చాలా వార్తలొచ్చాయి. ఆమె కూడా పలు ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. వివాహం తర్వాత రాచకుటుంబంలోకి వెళ్లిన తనకు ఆదరణ కన్నా అవమానాలే ఎక్కువగా ఎదురయ్యాయి. దీనికితోడు బ్రిటన్‌లోని ఓ వర్గం మీడియా కూడా వ్యతిరేకంగా వ్యవహరించింది. కథనాలు రాసింది.
దీంతో తాను మానసికంగా వేదనకు గురైనట్టు గతంలో చెప్పింది మేఘన్ మార్ల్కే. అయితే ఆ సమయంలో తాను ఆత్మహత్యకి పాల్పడాలనుకున్నట్టు చెప్పింది. మ్యారేజ్‌కి ముందు తనని దెబ్బకొట్టాలని చాలా రకాలుగా ప్రయత్నించిందని, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రిన్స్ హ్యారీని ఆమె వివాహం చేసుకోవడం అక్కడి వారికి నచ్చలేదని, అందుకోసం మేఘన్ ప్రతిష్టని దెబ్బతీసేందుకు బ్రిటన్ లోని ఓ వర్గం మీడియా దిగజారి వ్యవహరించిందని నటుడు సిమన్ రేక్స్ వెల్లడించి సంచలనాలకు తెరలేపారు.
నటి మేఘన్‌తో ఒక రాత్రంతా ఉన్నట్లు చెప్తే రూ.50 లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారని చెప్పి షాకిచ్చాడు. నిజానికి తనకు ఆ సమయంలో డబ్బులు చాలా అవసరం ఉన్నాయని, కానీ అందుకోసం ఇలాంటి తప్పుడు ప్రచారం చేయలేనని సదరు ఆఫర్‌ను తిరస్కరించినట్లు పేర్కొన్నాడు సిమన్. ఈ విషయం తెలుసుకున్న మేఘన్.. 'ఇంకా మంచి మనుషులు ఉన్నారని తెలిసినందుకు సంతోషంగా ఉంది' అంటూ తనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖ పంపిందట. దాన్ని ఫ్రేమ్ కట్టించుకుని ఇప్పటికీ ఇంట్లో భద్రంగా దాచుకున్నానని చెప్పాడు సిమన్.
కాగా మేఘన్, సిమన్ 2005లో వచ్చిన `కట్స్ బ్యాక్` సిరీస్‌లో ఒక్క ఎపిసోడ్‌లోనే కలిసి నటించారు. దీని ఆధారంగా చేసుకునే తమపై తప్పుడు ప్రచారానికి ప్లాన్ చేసినట్టు సిమన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే అమెరికన్ నటిగా విశేషాదరణ సంపాదించుకున్న మేఘన్ 2018లో ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకున్నాక సినిమాలకు గుడ్‌బై చెప్పింది. ఆ తర్వాత కుటుంబంతో విభేదాల కారణంగా ప్రిన్స్ హ్యారీ దంపతులు రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బ్రిటన్ రాజకుటుంబంలోని లోసుగులను, నియంతృత్వ పోకడలను బయటపెట్టినట్టయ్యింది. ఇదిలా ఉంటే హ్యారీ, మేఘన్‌లకు కొడుకు ఆర్చీ, కూతురు లిల్లీ డయానా ఉన్నారు.