షాపింగ్‌ మాల్‌లో హీరోయిన్‌ని కాపాడిన విలన్‌.. ఏం జరిగింది ?

Published : Apr 10, 2021, 12:36 PM IST
షాపింగ్‌ మాల్‌లో హీరోయిన్‌ని కాపాడిన విలన్‌.. ఏం జరిగింది ?

సారాంశం

హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకి ఇలాంటి సన్నివేశాలే ప్రధాన భూమిక పోషిస్తాయి. రియల్‌ లైఫ్‌లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే ఇందులో హీరోయిన్‌ కాపాడింది హీరో కాదు, విలన్‌ కావడం విశేషం. మరి ఆ సంగతులేంటో ఓ సారిచూస్తే.. 

సినిమాల్లో హీరోయిన్‌ని హీరో కాపాడతాడు. హీరోయిన్‌ని కొందరు ఆకతాయిలు ఆటపట్టించడం, వేధింపులకు గురి చేస్తుంటే, దాన్ని హీరో గమనించి వారి నుంచి ఆ హీరోయిన్‌ని రక్షిస్తాడు. సినిమాల్లో ఈ సన్నివేశాలే ఎక్కువగా కనిపిస్తాయి. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకి ఇలాంటి సన్నివేశాలే ప్రధాన భూమిక పోషిస్తాయి. రియల్‌ లైఫ్‌లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే ఇందులో హీరోయిన్‌ కాపాడింది హీరో కాదు, విలన్‌ కావడం విశేషం. మరి ఆ సంగతులేంటో ఓ సారిచూస్తే.. 

తమిళంలో లింక్‌ క్రియేషన్స్ పతాకంపై హేమవతి ఆర్‌ `ఓట్టం` అనే చిత్రాన్ని నిర్మిస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఇది రూపొందుతుంది. సినిమాతో ప్రముఖ దర్శకుడు దర్శకుడు రామనారాయణన్‌ శిష్యుడు ఎన్‌.మురుగన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాతో సంగీత దర్శకుడు ప్రదీప్‌ వర్మ హీరోగా పరిచయం అవుతున్నారు. అలాగే ఆయనకు జోడిగా బెంగుళూర్‌ మోడల్‌ ఐశ్వర్య సందోషి ఓ హీరోయిన్‌గా, కేరళాకి చెందిన అనుశ్రేయ మరో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో రవిశంకర్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. 

హీరోయిన్‌ సందోషి ఈ సినిమాలోని పాటల సన్నివేశాల కోసం డ్రెస్‌ కొనుగోలు చేసేందుకు బెంగుళూరులోని ఓ పెద్ద షాపింగ్‌ మాల్‌కి వెళ్లింది. ఆమెతోపాటు అదే షాపింగ్‌ మాల్‌కి విలన్‌ పాత్రదారి రవిశంకర్‌ కూడా వచ్చాడు. అయితే షాపింగ్‌ మాల్‌లో కొందరు సందోషిని ఆటపట్టించడంతోపాటు వేధింపులకు గురి చేశారు. ఇది గమనించిన రవిశంకర్‌ ఆ పోకిరి బ్యాచ్‌కి వాయించేశాడు. అక్కడి నుంచి వెళ్లకపోతే పోలీసులకు ఫోన్‌ చేస్తానని బెదిరించడంతో వారంతా పారిపోయారు. దీంతో ఆ హీరోయిన్‌ ఊపిరి పీల్చుకుంది. ఇలా రీల్‌ విలన్‌, రియల్‌ లైఫ్‌లో హీరో అయ్యాడు. ఆయన్ని ఆ చిత్రం బృందం అభినందించడం విశేషం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.! నాగచైతన్యతో సమంత, శోభిత.. అసలు మ్యాటర్ ఇది
Illu Illalu Pillalu Today Episode Dec 23: అమూల్యను విశ్వ ట్రాప్ చేశాడని తెలుసుకున్న ధీరజ్, ఇంగ్లిష్ టీచర్ వల్లి