60 ఏళ్ల తరువాత ఆస్కార్ వేడుకల్లో అనూహ్య మార్పు, రెడ్ కార్పెట్ రంగు మార్చిన అకాడమీ

Published : Mar 12, 2023, 02:46 PM IST
60 ఏళ్ల తరువాత ఆస్కార్ వేడుకల్లో అనూహ్య మార్పు,  రెడ్ కార్పెట్ రంగు మార్చిన అకాడమీ

సారాంశం

95 వ ఆస్కార్ అవార్డుల వేడుకలకు రంగం సిద్ధమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో మరికొన్ని గంటల్లోనే ఈ వేడుకలు  అంగరంగ వైభవంగా  జరగబోతున్నాయి. అయితే ఈసారి వేడుకల్లో అనూహ్య మార్పు కనిపించబోతోంది. దాదాపు 60 ఏళ్ల తరువాత వేడుకని కొత్తగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

ప్రపంచవ్యాప్తంగా అంతా ఎదురుచూస్తున్న ఆస్కార్  వేడుకలకు అంతా సిద్థం అయ్యింది. లాస్ ఏంజిల్ నగరం అకాడమీ అవార్డ్ ల ప్రధానోత్సవానికి ముస్తాబయ్యింది. అయితే ఈసారి ముస్తాబులో  చిన్న మార్పు చేశారు నిర్వాహకులు. మార్పు చిన్నదని చెప్పినా.. అదే ప్రత్యేకమైనది కాబోతోంది. అదేంటంటే.. ఆస్కార్ వేడుకల్లో అతి ముఖ్యమైనది.. ప్రత్యేకంగా నిలిచేది రెడ్ కార్పెట్. ఈ కార్పెట్ మీద ఒక్క సారి అయినా నడవాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద నటులంతా ఆశగా ఎదురు చూస్తుంటారు. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. అయితే అందరిని ఆ అవకాశం వరించదు.  ఈసారి  ఏకంగా ఆరెడ్ కార్పెట్  రంగును ఆస్కార్ అకాడమీ మార్చింది. 

రెడ్ కార్పెట్ ఆచారం ఆస్కార్ లో 1961 నుంచి వచ్చింది. 33వ అకాడమీ అవార్డు వేడుకల నుంచి రెడ్ కార్పెట్ పై సినిమా తారలు నడవండం స్టార్ట్ అయ్యింది. రాను రాను ఇది పెద్ద గౌరవంగా తయారయ్యింది. ఇక ఈసారి ఈ రంగును మార్చి ఆస్కార్ అకాడమీ.. షాంపైన్ రంగుకు కార్పేట్ ను  మార్చేసింది. దీనికి గల కారణాలుఏంటో తెలియదు కాని.. దాదాపు 60 ఏళ్ళుగా అనుసరిస్తున్న విధానాన్ని మార్చేందుకు అకాడమీ సిద్దమైంది. 

ప్రపంచం నలుమూలల్లో ఎక్కడ అవార్డుల వేడుక జరిగినా.. రెడ్ కార్పెట్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆస్కార్ లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డుల వేడుకల్లో అయితే.. కనీసం రెడ్ కార్పెట్ పై నడిచే అవకాశం వస్తే చాలని అనుకుంటారంతా. అటు హీరోయిన్లు కూడా ఈ కార్పెట్ పై క్యాట్ వాక్ లు చేస్తూ.. వయ్యారాలు ఒలకబోస్తుంటారు. అటువంటి క్రమంలో.. కార్పేట్ ను   షాంపైన్ రంగులోకి మార్చితే లుక్ ఎలా ఉంటుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఈక్రమంలో  హాలీవుడ్ లోని డాల్బీ థియేటర్స్ లో జరగనున్న ఈ ఆస్కార్ వేడుకలకు అకాడమీ భారీ ఏర్పాట్లు చేసింది. 

ముచ్చటగా మూడో సారి జిమ్మీ కిమ్మెల్ అకాడమీ అవార్డ్ ల వేడుకలకు హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇక ఈసారి ఆస్కార్ వేడుక భారతీయులకు ఎంతో ప్రత్యేకం కానున్నాయి. మన దేశం నుంచి ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా ఓరిజినల్ సాంగ్ విభాగంలో.. నాటునాటు పాటతో ఆస్కార్ కు పోటీ పడుతుంది.  ఇప్పటికే ఆర్ఆర్ఆఱ్ అంతర్జాతీయ ఖ్యాతి దక్కించుకుని ఆస్కార్ కు అడుగు దూరంలో నిలిచింది. కొన్ని నెలలుగా  రాజమౌళి.. ఆయనతో పాటు  రామ్ చరణ్, ఎన్టీఆర్ సహా మూవీ టీమ్ ఆర్ఆర్ఆర్ ను ప్రమోట్ చేస్తూ.. హాలీవుడ్ లో కష్టపడుతున్నారు. నాటునాటు పాటకు ఆస్కార్ పక్కా అని అంతా కాన్ఫిడెంట్ తో ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌