బాలీవుడ్ సీనియర్ నటి ఇంట విషాదం.. మాధురి దీక్షిత్ తల్లి మృతి..

By Asianet News  |  First Published Mar 12, 2023, 2:05 PM IST

బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ (Madhuri Dixit) ఇంట  తీవ్ర విషాదం నెలకొంది.  ఆమె తల్లి ఈరోజు కన్నుమూయడంతో కన్నీమున్నీరైంది. ఈ సందర్భంగా భావోద్వేగ వ్యాఖ్యలు చేసింది.
 


ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మాధురీ దీక్షిత్ తల్లి స్నేహలతా (91) Snehlatas మరణించారు. మాధురీ దీక్షిత్, ఆమె భర్త శ్రీరామ్ నేనే సయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ‘మా ప్రియమైన ఆయి (తల్లి), స్నేహలత ఆమె ప్రియమైన వారి మధ్య ఈ ఉదయం ప్రశాంతంగా మరణించారు’ అంటూ ట్వీట్ ద్వారా తెలిపారు. ఇవాళ  ఆమె అంతక్రియలు జరగనున్నట్టు తెలుస్తోంది.  ఆమె అనారోగ్యం రీత్యా  మరణించినట్టు సమాచారం. ఆమె మరణం పట్ల సెలబ్రెటీలు, శ్రేయోభిలాషులు చింతిస్తున్నారు. 

మాధురి ముంబైలో జన్మించింది. 1984లో అబోధ్‌తో తొలిసారిగా సినిమా అవకాశాన్ని అందుకుంది. 1999లో డాక్టర్ శ్రీరామ్ నేనేని వివాహం చేసుకుని హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది.  అయితే రీసెంట్ గా మాధురి దీక్షిత్ తల్లిపుట్టిన రోజు సందర్భంగా శ్రీరామ్ నేనే తన అత్తగారి గురించి స్వీట్ పోస్ట్ చేశారు. 90 ఏళ్ల  వయస్సులోనూ ఆమె పెయింట్ చేస్తారని చెప్పారు.  కాస్తా క్షీణించినట్టు తెలిపారు. ఆమె ప్రపంచంలోనే అత్యంత మనోహరమైన, అత్యంత సానుకూలమైన వ్యక్తి అంటూ, ఆమె ప్రతిభను ఎల్లప్పుడూ గుర్తిస్తామంటూ పలు ఫొటోలను షేర్ చేసుకున్నాడు. 

Latest Videos

ఇక తల్లిని కోల్పోయిన మాధురి దీక్షిత్ రీసెంట్ తల్లి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా చాలా ఎమోషనల్ అయ్యింది. పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ.. ప్రతి అమ్మాయికి నీలాంటి మంచి స్నేహితురాలు ఉండాలి. నాకోసం నువ్వు ఎంతో చేశావు. మీరు నేర్పిన పాఠాలు, చేసిన త్యాగాలు నా జీవితానికి అతిపెద్ద  బహుమతులు.. మీరు ఇలాగే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటూ కోరుకుంది. 

click me!