జబర్దస్త్ వినోద్ పై హత్యాయత్నం.. ఇంటి ఓనర్ తో గొడవ అందుకే!

Published : Jul 20, 2019, 03:24 PM ISTUpdated : Jul 20, 2019, 04:15 PM IST
జబర్దస్త్ వినోద్ పై హత్యాయత్నం.. ఇంటి ఓనర్ తో గొడవ అందుకే!

సారాంశం

కొద్దిసేపటి క్రితం జబర్దస్త్ వినోద్ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గాయాలతోనే వినోద్ కాచిగూడ పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు.

కొద్దిసేపటి క్రితం జబర్దస్త్ వినోద్ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గాయాలతోనే వినోద్ కాచిగూడ పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు. తన ఇంటి ఓనరే దాడికి పాల్పడ్డాడని పోలీసులకు తెలిపాడు. వినోద్, ఓనర్ కు ఇంటిని ఖాళీ చేసే విషయంలో వివాదం గత కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. 

తన ఇంటికి ఖాళీ చేయాలని ఇప్పటికే పలుమార్లు ఇంటి ఓనర్ ఆదేశించినా వినోద్ వినిపించుకోలేదు. నేను కోర్టుకైనా వెళతాను కానీ ఇంటిని మాత్రం ఖాళీ చేయను అని వినోద్ చెప్పాడట. ఈ విషయంలో ఇరువురు మధ్య నేడు మాటా మాటా పెరిగి పెద్ద గొడవ జరిగింది. 

ఆగ్రహంతో రెచ్చిపోయిన ఇంటి ఓనర్ ఇనుప రాడ్ తో వినోద్ పై దాడికి తెగబడ్డాడు. దీనితో వినోద్ కు తలపై, కంటి భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇంటి ఓనర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వినోద్ చికిత్స పొందుతున్నాడు. 

జబర్దస్త్ వినోద్ పై హత్యాయత్నం!

PREV
click me!

Recommended Stories

Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?
Director KK Passed Away: నాగార్జున `కేడి` మూవీ డైరెక్టర్‌ కన్నుమూత.. సందీప్‌ రెడ్డి వంగాకి ఈయనే గురువు