పవన్ గెడ్డం తీయడానికి అసలు కారణం ఇదేనా?

Published : Jun 21, 2019, 09:35 AM ISTUpdated : Jun 21, 2019, 10:18 AM IST
పవన్ గెడ్డం తీయడానికి అసలు కారణం ఇదేనా?

సారాంశం

ఎలక్షన్స్  ముందు వరకు తెల్ల పంచె, తెల్ల లాల్చీ, గెడ్డంలో కనిపించారు  పవన్‌ కళ్యాణ్. ఆ తరువాత జీన్స్‌ టీషర్ట్స్‌లోకి మారారు.  తాజాగా గెడ్డం కూడా ట్రిమ్‌ చేసి స్టైలిష్ లుక్‌లోకి వచ్చేశారు. 

ఎలక్షన్స్  ముందు వరకు తెల్ల పంచె, తెల్ల లాల్చీ, గెడ్డంలో కనిపించారు  పవన్‌ కళ్యాణ్. ఆ తరువాత జీన్స్‌ టీషర్ట్స్‌లోకి మారారు.  తాజాగా గెడ్డం కూడా ట్రిమ్‌ చేసి స్టైలిష్ లుక్‌లోకి వచ్చేశారు. జీన్స్‌, కలర్‌ఫుల్‌ షర్ట్‌, ట్రిమ్ చేసిన గెడ్డంతో ఉన్న పవన్ ని చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ  న్యూ లుక్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరో ప్రక్క మీడియా ఇదంతా కేవలం  సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ కోసమే అంటు రాసేస్తున్నాయి.  అయితే పార్టీని బలోపేతం చేస్తాను కానీ సినిమాలు చేయను అని పవన్ ఇప్పటికే ప్రకటించారు. మరి ఏమిటీ కూల్ లుక్ అంటారా..దానికి స్పెషల్ కారణముందని తెలుస్తోంది. అదేమిటంటే...

పవన్ కళ్యాణ్ అతి త్వరలోనే అమెరికాలో జరగబోయే తానా సభలకు వెళ్లనున్నారు. అందుకోసమే పవన్ గెడ్డం తీసారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రెగ్యులర్ లుక్‌లోకి రావాలని తానా నిర్వాహకులు రిక్వెస్ట్ చేశారని చెప్తున్నారు. అంతేకాకుండా ఆయన వీరాభిమానులు సైతం పవన్ కళ్యాణ్‌ను గడ్డం తీసి రెగ్యులర్ లుక్‌లోకి రావాలని కోరారని వినికిడి. దాంతో    చాలా  కాలం గ్యాప్ తరువాత మళ్లీ ఇదిగో ఇలా గ్లామర్ లుక్‌లోకి మారిపోయిరు  పవన్ కళ్యాణ్.

PREV
click me!

Recommended Stories

Rishab Shetty: హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రికి రిషబ్ శెట్టి.. 575 మెట్లు ఎక్కిన దంపతులు!
బాక్సాఫీస్ వద్ద 2025లో 5 పెద్ద క్లాష్‌లు, ఎన్టీఆర్ సినిమాతో పాటు పోటీలో దారుణంగా నష్టపోయినవి ఇవే