విజయ్ కు అభిషేక్ నామా కౌంటర్... వెనక అసలు కారణం

Published : Sep 06, 2023, 10:10 AM IST
విజయ్ కు అభిషేక్ నామా కౌంటర్... వెనక అసలు కారణం

సారాంశం

వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రాన్ని పంపిణీ చేసి రూ.8 కోట్లు నష్టపోయాం. దానిపై ఎవరూ (Abhishek Nama) స్పందించలేదు. ఇప్పుడు నీ పెద్ద మనసుతో అభిమానుల కుటుంబాలకు రూ. కోటి విరాళంగా ఇస్తున్నావ్‌. 


విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా రిలీజ్ అయి మంచి హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. బి,సి సెంటర్లు ఎలా ఉన్నా మల్టిప్లెక్స్ లలో, ఏ సెంటర్లలలో, ఓవర్ సీస్ లో ఈ సినిమా కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. యుఎస్ లో అయితే డిస్ట్రిబ్యూటర్ ఆల్రెడీ లాభాల్లోకి వచ్చి పండగ చేసుకుంటున్నారు.  ఇక ఆనందాన్ని విజయ్ దేవరకొండ మనసారా ఆశ్వాదిస్తున్నారు. విశాఖపట్నంలో జరిగిన ఖుషి సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ తన మీద జరుగుతున్న ఎటాక్ గురించి ప్రస్తావిస్తూనే ఈ సినిమాని ఇంతగా హిట్ చేసినందుకు గాను తాను అభిమానులకు ఏదైనా చేయాలనుకుంటున్నానని చెప్పి అప్పటికప్పుడు కోటి రూపాయలు తన రెమ్యునరేషన్ లో నుంచి 100 కుటుంబాలకు లక్ష చొప్పున పంచాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించారు. దాంతో  ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్ గా అయిపోయాడు.
 
అంతా సజావుగా జరుగుతుందనుకున్న టైమ్ లో అభిషేక్ నామా నుంచి కౌంటర్ వచ్చింది. అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ విజయ్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్‌ చేసింది.   ఆ ట్వీట్ లో ...‘‘డియర్‌ విజయ్‌ దేవరకొండ.(Vijay Devarakonda). వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రాన్ని పంపిణీ చేసి రూ.8 కోట్లు నష్టపోయాం. దానిపై ఎవరూ (Abhishek Nama) స్పందించలేదు. ఇప్పుడు నీ పెద్ద మనసుతో అభిమానుల కుటుంబాలకు రూ. కోటి విరాళంగా ఇస్తున్నావ్‌. దయచేసి మమ్మల్ని, మా ఎగ్జిబిటర్స్‌, డిస్ట్రిబ్యూటర్స్‌ కుటుంబాలకు కాపాడాలని కోరుతున్నాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు ట్వీట్‌ సోషల్‌ మీడియాలో పెద్ద దుమారమే లేపుతోంది. 

దీనిపై సోషల్ మీడియా జనం రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘నీకు నష్టం వచ్చిందని ఇప్పుడు అడుగుతున్నావ్‌... లాభం వచ్చుంటే విజయ్‌ని పిలిచి డబ్బు ఇచ్చేవాడివా? అని ఓ నెటిజన్‌ ప్రశ్నించాడు. ఇదే మాట ఇప్పుడున్న పెద్ద హీరోలను అచిగే దమ్ముందా? అని ఇంకొందరు అంటున్నారు. మరో నెటిజన్‌ అయితే.. ‘ఎవడు కొనమన్నాడు.. అర్జున్‌ రెడ్డి సినిమాను మరోమాట లేకుండా ఎంత అంటే అంత కొన్నారు.. అప్పుడు లాభాలు చూశారు. అప్పుడు విజయ్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు అతను ఫ్యాన్స్‌ కోసం ఏదో సాయం చేస్తుంటే.. ఇలా మాట్లాడటం కరెక్ట్‌ కాదు. ఇది సందర్భం కూడా కాదు. ఆ సినిమాకు విజయ్‌ ఏమైనా నిర్మాతనా? మీరు నిర్మాతను అడగాలి కానీ విజయ్‌ను ఎలా అడుగుతారు? అని అభిషేక్‌ పిక్చర్స్‌ను విమర్శిస్తున్నారు.  ఈ నేపధ్యంలో అభిషేక్ నామాకు ఎందుకు అంత కోపం వచ్చింది  అసలు వీరిద్దరి మధ్య జరిగిన వివాదం ఏమిటి? ఎందుకు ఇలా ట్వీట్ చేయాల్సి వచ్చింది.. అభిషేక్ నామ పూర్తి వెర్షన్ ఒక వెబ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అదేమిటంటే...విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాని కేఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద నిర్మించగా నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ బేసిస్ మీద డిస్ట్రిబ్యూట్ చేసి ఎనిమిది కోట్ల వరకు అభిషేక్ నామ నష్టపోయారుట. ఈ సినిమా నష్టం వచ్చాక ఈ సినిమా నష్టాన్ని తీర్చమని అడగను, మీ రెమ్యూనరేషన్ ఎంత ఉంటే అంతే తీసుకుని మా బ్యానర్ కి మాత్రం ఒక సినిమా చేసి పెట్టండి, ఒక మంచి కథతో సినిమా చేసి ఆ నష్టాన్ని భర్తీ చేసుకుందాం అని అభిషేక్ నామా విజయ్ కి ప్రపోజల్ పెట్టారట. అయితే విజయ్ దేవరకొండ టీం మాత్రం ఇప్పుడు తెలుగు సినిమా నిర్మాతలకు సినిమాలు చేయట్లేదు కాబట్టి ఇప్పట్లో సినిమా చేయడం కష్టం అని క్లారిటీ ఇచ్చారట. అయితే ఇదంతా జరిగింది లైగర్ షూటింగ్ సమయంలో. ఆ తర్వాత గతంలో విజయ్ దేవరకొండ ఒప్పుకున్న మైత్రి మూవీ మేకర్స్ కి ఈ ఖుషి సినిమా చేయడం రిలీజ్ అవ్వడం జరగింది. దాంతో  తమకు సినిమా చేయమని అడిగితే చేయకపోవడంతో నామ అభిషేక్ ఇంతలా హర్ట్ అయి ఉండవచ్చని , అందుకే ఈ ట్వీట్ చేసారని ప్రచారం జరుగుతోంది. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:కాశీతో స్వప్నగొడవ-ఇంట్లో నుంచి పొమ్మన్న కావేరి-దీపపై నిందేసిన కాంచన
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్, మోక్షజ్ఞ సినిమాకు న్యూ ఇయర్ లో మోక్షం, డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?