
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన `ఏజెంట్` చిత్రం ఇటీవల విడుదలై డిజప్పాయింట్ చేసింది.ఆ సినిమా ఘోర పరాజయాన్ని చెందింది. కనీసం పది కోట్ల షేర్ ని కూడా రాబట్టలేకపోయింది. ఈ సినిమా బడ్జెట్ 70కోట్లకుపైగానే అయ్యింది. 25-30కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. దీంతో చాలా దారుణంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్మాతతోపాటు కొన్న బయ్యర్లు, సినిమా తీసిన దర్శకుడు సురేందర్‌రెడ్డి, హీరోగా నటించిన అఖిల్ కూడా ఈ సినిమా ద్వారా చాలా నష్టపోయారు. పూర్తి పారితోషికం కూడా తీసుకోలేదు.
ఏ ఏడాది వచ్చిన డిజాస్టర్లలో `ఏజెంట్` ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ఫెయిల్యూర్‌పై ఇప్పటికే నిర్మాత అనిల్ సుంకర వివరణ ఇచ్చాడు. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా సినిమా చేసి తప్పు చేశామని, అక్కడే పొరపాటు జరిగిందని చెప్పారు. తాజాగా హీరో అఖిల్ సైతం ఓ నోట్‌ని పంచుకున్నారు. తాజాగా ఆయన అభిమానులతో ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. మంచి సినిమా ఇవ్వలేకపోయామని, మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయలేకపోయామని విచారం వ్యక్తం చేశారు.
అఖిల్ తన అభిమానులకు, శ్రేయోభిలాషులను ఉద్దేశించిన ఆయన చెబుతూ, `ఏజెంట్` సినిమాని తీసుకురావడానికి జీవితాలను డెడికేట్ చేసి కష్టపడిన చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు అఖిల్. తాము మంచి సినిమా అందించేందుకు తమవంతుగా ఎంతో ప్రయత్నించామని, దురదృష్టవశాత్తు అది స్క్రీన్‌పైకి మేం అనుకున్నట్టుగా రాలేదు. మంచి సినిమాని అందించలేకపోయామన్నారు. ఈ సందర్భంగా తమకి సపోర్ట్ గా నిలిచిన నిర్మాత అనిల్ సుంకరకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు తమపైనమ్మకంతో సినిమాని తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లకి, అలాగే సినిమాకి ప్రారంభం నుంచి సపోర్ట్ చేసిన మీడియాకి థ్యాంక్స్ చెప్పారు అఖిల్. ఈసందర్భంగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి చెబుతూ, మీరు పంచే ప్రేమ, ఎనర్జీతో పనిచేస్తున్నానని, అందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని, నన్ను నమ్మిన వారికోసం మరింత బలంగా తిరిగి వస్తామని, మంచి సినిమాతో వస్తామని చెప్పారు అఖిల్. ఆయన పోస్ట్ వైరల్ అవుతుంది.
అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన `ఏజెంట్` చిత్రంలో సాక్షి వైద్య కథానాయికగా నటించింది. మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించారు. ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది. మొదటి షో నుంచే నెగటివ్ టాక్‌ని తెచ్చుకుంది. ఇప్పుడు పెద్ద డిజాస్టర్ చిత్రంగా నిలిచింది.