Raviteja: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన టైగర్ నాగేశ్వరరావు... అక్కడ ఫ్రీగా చూసేయండి!

Published : Nov 17, 2023, 10:51 AM ISTUpdated : Nov 17, 2023, 11:01 AM IST
Raviteja: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన టైగర్ నాగేశ్వరరావు... అక్కడ ఫ్రీగా చూసేయండి!

సారాంశం

టైగర్ నాగేశ్వరరావు నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సైలెంట్ గా విడుదల చేశారు. రవితేజ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.   

టైగర్ నాగేశ్వరరావు మూవీ పీరియాడిక్ బయోపిక్ గా తెరకెక్కింది. 70లలో దేశాన్ని వణికించిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథగా దర్శకుడు వంశీ కృష్ణ రూపొందించాడు. స్టూవర్టుపురం అనే చిన్న గ్రామంలో జన్మించిన టైగర్ నాగేశ్వరరావు ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచాడు. పెద్దలను దోచుకుని పేదలకు పెట్టేవాడు. టైగర్ నాగేశ్వరరావు జీవితకథను వెండితెరకు తేవాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. హీరో రవితేజతో అది సాకారం అయ్యింది. 

దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదలైన టైగర్ నాగేశ్వరరావు మూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ పర్లేదన్న ఆడియన్స్ సెకండ్ హాఫ్ నిరపరిచింది అన్నారు. అలాగే సినిమా నిడివి ఎక్కువ అయ్యిందన్న వాదన వినిపించింది. దీంతో ఓ అరగంట నిడివి తగ్గించి మరో వెర్షన్ విడుదల చేశారు. పండగ సీజన్ కావడంతో ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. టైగర్ నాగేశ్వరరావు పది కోట్లకు పైగా నష్టాలు మిగిల్చింది. 

కాగా విడుదలైన నెల రోజుల్లోనే టైగర్ నాగేశ్వరరావు ఓటీటీలోకి వచ్చింది. టైగర్ నాగేశ్వరరావు డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. నవంబర్ 17 నుండి ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ చందాదారులు ఫ్రీగా టైగర్ నాగేశ్వర్ రావు మూవీ చూసేయవచ్చు. టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి డిజిటల్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. 

రవితేజకు జంటగా నుపుర్ సనన్ నటించింది. ఏళ్ల తర్వాత రేణూ దేశాయ్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె హేమలత లవణం అనే సామాజిక కార్యకర్త రోల్ చేశారు. మురళీ శర్మ, అనుపమ్ ఖేర్, జిషు సేన్ గుప్తా కీలక రోల్స్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. మాస్ మహారాజ్ ఫ్యాన్స్ నేటి నుండి ఓటీటీలో టైగర్ నాగేశ్వరరావు ఎంజాయ్ చేయవచ్చు... 

అఫీషియల్: విజయ్ #LEO ఓటీటీ డేట్ ఫిక్స్
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి