Brahma Mudi Serial Today:స్వప్నను అడ్డంగా బుక్ చేసిన రాహుల్, ఎమోషన్స్ తో పిండేసిన అప్పూ..!

By telugu news team  |  First Published Nov 17, 2023, 10:17 AM IST

‘ఏంటి అమ్మా, నా కోడలినే చూస్తున్నావ్? ఏమైనా అడగాలా’ అంటుంది. చిట్టి నేనేం అడగాలి అంటుంది. దీంతో, అలానే చూస్తుంటే, ఏమైనా అడగాలేమో అనుకున్నా అని కవర్ చేస్తుంది. పనిలో పనిగా ధాన్యలక్ష్మి రుద్రాణిపై సెటైర్లు వేస్తుంది.
 



Brahma Mudi  Serial Today: బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 17 ఎపిసోడ్ : నిన్నటి ఎపిసోడ్ లో అప్పూ ప్రేమ విషయం తెలిసి , కనకం చితకబాదిన సంగతి తెలిసిందే. అలా కొడుతున్న సమయంలో అప్పూ తండ్రి వస్తాడు. దీంతో, ఏమీ జరగనట్లుగా కనకం ప్రవర్తిస్తుంది. అదే ఈరోజు ఎపిసోడ్ లోనూ కంటిన్యూ అవుతుంది. ఎందుకు అప్పూని కొట్టడానికి చెయ్యి ఎత్తావ్ అని అడుగుతాడు. దానికి సమాధానం చెప్పకుండా, ఏవేవో ఆన్సర్లు చెప్పి, ఆ టాపిక్ డైవర్ట్ చేస్తుంది కనకం.

Latest Videos

సీన్ కట్ చేస్తే, దుగ్గిరాల కుటుంబసభ్యులు అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే స్వప్న కిందకు దిగి వస్తుంది. చిట్టిని చూసి మళ్లీ, అరుణ్ గురించి అడుగుతుందేమో అని, తర్వాత వచ్చి తిందాం అనుకుంటుంది. కానీ, ఈలోగా రాహుల్, రుద్రాణి కావాలనే వెళ్తున్న స్వప్నను పిలుస్తారు. ఆకలిగా లేదు, తర్వాత తింటాను అని స్వప్న వెళ్లబోతుంటే, టిఫిన్ వేడిగానే తినాలి వచ్చి, తినమని రుద్రాణి పట్టుబడుతుంది.దీంతో, కావ్య కూడా స్వప్నను పిలుస్తుంది. ఇక, తప్పక స్వప్న వచ్చి టిఫిన్ చేయడానికి కూర్చుంటుంది. చిట్టి మాత్రం స్వప్నను అనుమానంగా చూస్తూనే  ఉంటుంది. వెంటనే, రుద్రాణి ఇదే ఛాన్స్ అనుకొని  ‘ఏంటి అమ్మా, నా కోడలినే చూస్తున్నావ్? ఏమైనా అడగాలా’ అంటుంది. చిట్టి నేనేం అడగాలి అంటుంది. దీంతో, అలానే చూస్తుంటే, ఏమైనా అడగాలేమో అనుకున్నా అని కవర్ చేస్తుంది. పనిలో పనిగా ధాన్యలక్ష్మి రుద్రాణిపై సెటైర్లు వేస్తుంది.

ఇక, స్వప్న టిఫిన్ చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఏమైందని కావ్య అడిగితే, తినే మూడ్ లేదని చెబుతుంది. స్వప్న అలా వెళ్లగానే, రాజ్ ఇలా వచ్చి కూర్చుకుంటాడు. వెంటనే మనసులో కావ్యకు తన నటన ఎలా ఉంటుందో  చూపిస్తా అని అనుకుంటాడు. వెంటనే ‘ఏంటి కళావతి, నేను వచ్చినా టిఫిన్ పెట్టడం లేదు. నోరు తెరిచి అడిగితేనే పెడతావా?’ అని అడుగుతాడు. తాతయ్య అక్కడ ఉన్నాడని రాజ్ యాక్టింగ్ చేస్తున్నాడని కావ్యకు అర్థమైపోతుంది. అదంతా నిజమని అనుకున్న ధాన్యలక్ష్మి, వీళ్లందరికీ వడ్డించింది చాలు, మీ ఆయనకు వడ్డించు కావ్య అంటుంది. అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, వడ్డించుకోండి అంటుంది కావ్య. అంటే, మిగిలిన ఇంట్లో వాళ్లు అందరూ ముసలివాళ్లు అయిపోయారు, వారు వడ్డించుకోలేరని వాళ్లకు వడ్డిస్తున్నావా అంటాడు రాజ్. ఇక రాజ్ కావ్యను అందరి ముందు నా పెళ్లాం అని చెబుతాడు. అది విని రుద్రాణి ముఖం మాడిపోతుంది.

ఇక, కావ్య రాజ్ కి వడ్డిస్తుంది. కావాలని ఇద్దరూ ఒకరిమీద, మరొకరికి ప్రేమ  ఉన్నట్లు తెగ నటించేస్తారు. దానిని చూసి ఇంట్లో వాళ్లు అందరూ సంతోషిస్తారు. రుద్రాణి మాత్రం మీరిద్దరూ అనోన్యంగా లేరని,కోపాన్ని కవర్ చేసుకుంటూ నటిస్తున్నట్లుగా ఉంది అని కనిపెట్టేస్తుంది. కానీ, చిట్టి మాత్రం వాళ్లది నిజమైన ప్రేమ అని, ఆలూ, మగలు అంటే అలానే ఉంటారని చెబుతుంది. వెంటనే ధాన్యలక్ష్మి.. రుద్రాణికి ఈ విషయాలు తెలియవు కదా అంటూ సెటైర్ వేస్తుంది. తనను వదిలేసిన మొగుడి టాపిక్ తేవడంతో హర్ట్ అయిపోయి రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా ఎందుకు అన్నావ్ ధాన్యలక్ష్మి అని చిట్టి అడగగా, ప్లేట్ లో పెట్టిన టిఫిన్ తిన్న తర్వాతే వెళ్లిందని రాజ్ బాబాయ్ చెప్పేస్తాడు. అందరూ ప్లేట్ వంక చూసేసరికి, నిజంగా టిఫిన్ అయిపోయి ఉంటుంది. ఈ సీన్ నవ్వు తెప్పించేలా ఉంటుంది.

ఇక, కావ్య తన యాక్టింగ్ మొదలుపెడుతుంది. అది కావాలా? ఇది కావాలా అని అడుగుతూ ఉంటుంది. రాజ్ కూడా అది పెట్టు, ఇది పెట్టూ అని ఓవర్ చేస్తాడు. ఇంట్లో వాళ్లు అందరూ వారిద్దరిని చూసి మురిసిపోతూ ఉంటారు. ఇక, వాళ్ల అమ్మ సీరియస్ గా చూస్తోందన్న విషయం లాస్ట్ లో గమనించిన రాజ్, అయిపోయాను రా బాబోయ్ అన్నట్లుగా ఎక్స్ ఫ్రెషన్ ఇస్తాడు. తర్వాత టిఫిన్ అయిపోయిన తర్వాత రాజ్ హ్యాండ్ వాష్ కి వెళ్తాడు. తర్వా చేతిని నాప్ కిన్ కి తుడుచుకోకుండా కావాలని, తన చీర కొంగు పెడుతుంది. అది గమనించని రాజ్, కొంగుకు తడుచుకుంటాడు. ఇక, అంతే మళ్లీ కావ్య తన యాక్టింగ్ మొదలుపెడుతుంది. చిన్నప్పుడు వాళ్ల అమ్మ కొంగు కి ఇలానే తుడుకునేవాడు అని సుభాష్ చెప్పగానే, అపర్ణకు ఏడుపు వచ్చేస్తుంది. ఈలోగా కావ్య, అబ్బో అత్తయ్యగారి స్థానం నాకిచ్చారా అండి అని పొంగిపోతుంది. అది విని అపర్ణకు మండిపోతుంది. భలే ఇరికించేసింది అని రాజ్ కి మండుతూ ఉంటుంది.

ఇక, తన గదిలోకి వెళ్లిన స్వప్న, అమ్మమ్మ అలా చూడటం  ఇబ్బందిగా అనిపించిందని అనుకుంటూ ఉంటుంది. అసలు ఇలా అవ్వడానికి అరుణ్ కారణం అని, వాడికి ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేయకుండా ఆగిపోయిన అరుణ్, వెంటనే రాహుల్ కి కాల్ చేస్తాడు. స్వప్న కాల్ చేస్తోందని చెబుతాడు. ఇక, నెక్ట్స్ ఏం చేయాలో రాహుల్ చెబుతాడు. సరే అని అరుణ్ అంటాడు.ఆ తర్వాత, చిట్టి ముందు రాహుల్ తన నటనను మొదలుపెడతాడు. స్వప్న, అరుణ్ కలిసి దిగిన ఫోటో పట్టుకొని రాహుల్ బాధపడుతున్నట్లుగా నటిస్తాడు. అది చూసిన చిట్టి, కి స్వప్న మీద అనుమానం మొదలౌతుంది. స్వప్న నిజంగానే రాహుల్ ని మోసం చేస్తుందా అని చిట్టి ఆలోచనలో పడిపోతుంది.

సీన్ కట్ చేస్తే, ఇంట్లో అప్పూ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పూని కొట్టినందుకు కనకం కూడా బాధపడుతూ ఉంటుంది. వెంటనే వెళ్లి, అప్పూ పక్కన కూర్చొని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. కొట్టినందుకు చాలా బాధగా ఉందని చెబుతుంది. చేతులు నొప్పి పెడుతున్నాయా అంటే, కాదు మనసు నొప్పి పెడుతోంది అని కనకం చెబుతుంది. ఆ తప్పు ఎందుకు చేశావ్ ని అప్పూని కనకం ప్రశ్నిస్తుంది. దానికి అప్పూ చెప్పిన సమాధానం వెంటే ఎవరికైనా కన్నీళ్లు రాకమానవు.

‘తెలీదమ్మా, నిజంగానే తెలీదు. ఆ బాద్మాష్ గాడితో ఇన్ని రోజులు కలిసి తిరిగాను. ఎప్పుడూ నాకు ఏమీ అనిపించలేదు. మంచోడు, అమాయకుడు అనుకున్నాను కానీ, వాడిమీదే మనసుఅయితదని అనుకోలేదు. ముందే, నా మనసునాకు తెలిస్తే, అప్పుడే దూరం పెట్టేదాన్ని కదమ్మా. అదేనేమో ప్రేమంటే. దగ్గరున్నప్పుడు విలువ తెలీదు. దూరమౌతున్నప్పుడు విలువ తెలుస్తది. వాడు నాకు ఎప్పుడూ దూరం కాలేదు. ఆ అనామిక ఎప్పుడు అయితే వచ్చిందో, ఆ పిల్లకు దగ్గరయ్యాడు. ముందు నన్ను పట్టించుకోవడం లేదని కోపం వచ్చేది. ఒక ఆడపిల్ల మనసు ఇలా ఉంటందని, నా ముఖానికి కూడా ప్రేమ కలుగుతుందని నేను అనుకోలేదు. లేకపోతే ఏందమ్మా, కావ్య అక్క ఆ ఇంట్లో పడే కష్టాలు చూసి, వాళ్లు మనల్ని మనుషుల్లా కూడా చూడరని తెలిసి కూడా, వాళ్ల అబ్బాయిని ప్రేమిస్తానమ్మా,? పోయిపోయి వాళ్ల ఇంట్లో పడాలని ఏ ఆడపిల్లా అనుకోదు కదమ్మా.’ అంటూ ఏడుస్తుంది.

ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదని కనకం అనగా, తనకు తెలుసు అని,అందని దాని కోసం ఆశపడటం తనదే తప్పు అని ఏడుస్తుంది. దీంతో, కనకం, అప్పూని తన ఒడిలో పడుకోపెట్టుకొని ఓదారుస్తుంది. ఇద్దరూ ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదని, ఎవరికీ చెప్పుకోలేనని, అలా అని తనలో తాను దాచుకోలేకపోతున్నానంటూ అప్పూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది.

ఇక, రాత్రి బెడ్రూమ్ లో బెడ్ పై కావ్య పడుకొని పుస్తకం చదువుతూ ఉంటుంది. రాజ్ రావడం చూసి, కావాలనే చూడనట్లుగా నటించి, పుస్తకంలో ఉన్నది చదువుతూ ఉంటుంది. బుక్ లో ఉన్నది చదువుతున్నట్లుగా బిల్డప్ ఇస్తుంది కానీ, రాజ్ ని ఉద్దేశించి చెబుతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. కమింగ్ అప్ లో అరుణ్ దగ్గుబాటి ఇంటికి వస్తాడు. అతనిని కలవడానికి స్వప్న వెళ్లగా, రాజ్ చూసేస్తాడు.

click me!